సాధారణంగా దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగలలో దీపావళి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే . చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా  ఈ దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఎక్కడ తారతమ్యం  లేకుండా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో దీపావళి సాంస్కృతి అటు విదేశాలలో కూడా పాకి పోతుంది.. అయితే దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఒకవైపు టపాకాయల శబ్దాలు మరోవైపు దీపాల కాంతులతో దేశం మొత్తం వెలిగిపోతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఎంతోమంది తమకు ఇష్టమైన పటాకాయలు కాల్చి కాస్త జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఇక సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇంకొంతమంది మాత్రం యువకులు ఆకతాయి పనులు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొంతమంది యువకులు చేసే పనులు చూస్తే ఇదేం తిక్క రా నాయనా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ యువకుడు చేసిన పని కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అందరిలా మనం కూడా బాన సంచా కాలిస్తే కిక్కు ఏముంది అనుకున్నాడో ఏమో డిఫరెంట్ గా థింక్ చేశాడు.


 రాజస్థాన్లోని అలవారకు చెందిన యూట్యూబర్ అమిత్ మిశ్రా కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి ఒక కారును టార్గెట్ చేసుకున్నాడు. దీపావళి సందర్భంగా ఆ కారకు ఏకంగా లక్ష సీమటపాకాయలతో అలంకరించాడు. ఇక ఆ తర్వాత ఆ టపాకాయలు అన్నింటిని కూడా జాయింట్ చేసి దానికి నిప్పు అంటించాడు. కాసేపటికి ఆ ప్రాంతమంతా కూడా క్రాకర్స్ శబ్దంతో మారుమోగిపోయింది అని చెప్పాలి. ఇక చుట్టూ క్రాకర్స్ పేలడంతో ఎరుపు రంగులో ఉన్న ఆ కారు కలర్ మొత్తం మారిపోయింది. అంతేకాదు టపాసుల దాటికి ఆ కారు గ్లాస్ కూడా పగిలిపోయింది. అయితే ఎన్ని బాంబులు పేలినప్పటికీ అటు కారు ఇంజన్ మాత్రం పనిచేయడం గమనార్హం. మళ్లీ ఆ యూట్యూబర్ తన కార్ స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోగా ఎంతో మంది నెటిజెన్లు  మాత్రం అతను చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: