
అంతేకాకుండా జనసేన ఎమ్మెల్యేకి చెందిన మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థలో ముంజేరులో 208,296,337,392,,343,342, వంటికి సర్వే నెంబర్లలో సుమారుగా 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ సంస్థ కోసం ఆక్రమించినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించి.. అప్పట్లో ఆ భూములకు వేసిన రోడ్డు, కంచె అన్నిటిని కూడా తొలగించారనే విషయాన్ని అక్కడ పత్రికలు, మీడియా హైలెట్ చేశాయి.. దీంతో పాటుగా ధనాలపేట గ్రామంలో దళితుల భూమిని ఎమ్మెల్యే ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయనే విధంగా పత్రికా ప్రకటనలలో రాశారట. దీంతో ఆ నియోజకవర్గంలోని అధికారుల మీద జనసేన ఎమ్మెల్యే భర్త ఫైర్ అయినట్టుగా వినిపిస్తున్నాయి.
తనకు అనుకూలంగా లేని ఎంపీడీవోల మీద, ఇతర అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని దీనివల్ల ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి అధికారులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందట. ముఖ్యంగా భోగాపురం మండలంలో పనిచేయడానికి అధికారులు భయపడే పరిస్థితుల్లో ఉన్నాయనే విధంగా వార్తలు పత్రికలలో రావడంతో ఈ విషయంపై పాత్రికేయుల మీద ఎమ్మెల్యే లోకం మాధవి భర్త విరుచుకుపడ్డారు.మా గురించి నెగిటివ్ గా వార్తలు రాస్తే తాటతీస్తామంటూ హెచ్చరించారు. తాజాగా జరిగిన ఒక మీటింగ్లో లోకం మాధవి భర్త విమర్శించడంతో ఈ విషయాన్ని పత్రికా సిబ్బంది రాయడానికి ఇబ్బంది పడడంతో వాళ్ల యొక్క వాట్సప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ గా చేస్తే కొన్ని వీడియోలను షేర్ చేశారు. మరి ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.