ప్రతి అమ్మాయి పెళ్లి తరువాత జీవితంలో మార్పులు తప్పవు. ఎంత స్టార్ అయినా, ఎంత సెలబ్రిటీ అయినా పెళ్లి తరువాత కొత్త బంధాలను, కొత్త బాధ్యతలను మలచుకోవాల్సిందే. అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ దీనికి పక్కా ఉదాహరణ. నాగ చైతన్యతో రిలేషన్ బయటపడకముందు ఆమె గురించి తెలుగు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తెనాలిలో పుట్టింది అయినా, బాలీవుడ్ లో కెరీర్ చేసుకుంటూ ఫోటోషూట్స్ చేస్తూ ఉన్నా.. తెలుగువారికి అంతగా సుపరిచితం కాలేదు. కానీ చై – శోభితా ఎప్పుడైతే కెమెరా కంట పడ్డారో, అప్పటి నుంచి ఆమె పేరు హాట్ టాపిక్ అయ్యింది. సమంతతో పోలికలు తప్పకపోవడంతో, సోషల్ మీడియాలో శోభితాపై విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.
 

“సామ్ లాంటి అర్హత లేదు.. సెట్ కాదు” అంటూ వంద మాటలు వినిపించాయి. సమంత ఫ్యాన్స్ అయితే ప్రత్యేకంగా ఆమెను టార్గెట్ చేశారు. అయితే ఆ వివాదాలన్నీ పెళ్లి వరకు మాత్రమే నిలిచిపోయినట్టే. ఎందుకంటే పెళ్లి తరువాత శోభితా ప్రవర్తన, స్టైల్, ఫ్యామిలీ బాండింగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంట్లో భర్త కోసం వండిపెట్టడం నుంచి ఎయిర్‌పోర్ట్ వద్ద ఒకరి కోసం ఒకరు ఎదురుచూడడం వరకు, ఆమెలో ఒక గృహిణి కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. అక్కినేని ఇంటి ఫంక్షన్స్ లోనూ, బయట పబ్లిక్ ఈవెంట్స్ లోనూ సింపుల్ అయినా స్టైలిష్ డ్రెస్సింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఒక షోరూమ్ ఓపెనింగ్ లో రెడ్ చీరలో మల్లెపూలతో మెరిసిన శోభితా నెటిజన్లను ఫిదా చేసింది.

 

తాజాగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఎంగేజ్‌మెంట్ లో లైట్ గ్రీన్ చీరలో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. పక్కన ఆలివ్ గ్రీన్ కుర్తాలో చై ఉండటంతో జంట మరింత చూడముచ్చటగా నిలిచింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అభిమానులు కూడా తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. మునుపటి నెగిటివ్ టాక్ కి బదులుగా ఇప్పుడు “సామ్ పేరును ఎవరూ తీసుకురావడం లేదు, శోభితా పర్ఫెక్ట్ అక్కినేని కోడలు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆమె అక్కినేని గౌరవాన్ని కాపాడుతుందని కూడా నమ్ముతున్నారు. మొత్తానికి.. పెళ్లి తరువాత నెమ్మదిగా తాను అక్కినేని కుటుంబంలో కలిసిపోతూ, పర్ఫెక్ట్ కోడలిగా పేరు తెచ్చుకుంటోంది శోభితా ధూళిపాళ. మరి ఈ గౌరవాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటుందో, కాలమే సమాధానం.

మరింత సమాచారం తెలుసుకోండి: