గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. ఆ అటవీ ప్రాంతంలో సింహం సంచరిస్తుందనే విషయం తెలిసి ఇటీవల కొందరు కుక్కలను, కోళ్లను ఎరగా వేస్తున్నారు. ఈ సారి ఏకంగా ఆవునే ఎరగా వేసి.. సింహం వేటను కళ్లతో స్వయంగా చూడాలని అనుకున్నారు. ఊహించినట్లే సింహం నేరుగా ఆవు మీదకు దూకి చంపి తీనేసింది. బాధతో అల్లాడుతున్న ఆ ఆవును చూసి పైశాచిక ఆనందం పొందారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.