కరోనా అంటే అదొక ప్రపంచాన్ని గడ గడ లాడించిన వైరస్ అని అందరికి తెలుసు. కాని అది ఒక మనిషి పేరు కూడా ప్రస్తుతం ఆ వైరస్ తో పాటు ఆ మనిషి కూడా వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...ఆమె పేరు కరోనా థామస్. కొల్లం కార్పొరేషన్ ఎన్నికలు నేపథ్యంలో మిథాలీ వార్డులో బీజేపీ అభ్యర్థిని పోటీ చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలో ఆమెకు ఊహించని స్పందన వస్తోంది. ఆమె పేరు కరోనా కావడంతో.. జనాలు ఆ పేరుతోనే ఆమెను పలకరిస్తున్నారు.