అంతర్జాతీయ ఒలంపిక్ సంస్థ (IOC) వెంటనే మెగా క్రీడలకు సిద్ధంగా ఉండండి అంటూ అంతర్జాతీయ క్రీడాకారులకు పిలుపునిచ్చింది.త్వరలోనే టోక్యో ఒలంపిక్స్ జరుగుతాయని, ఆ ఒలంపిక్స్ కి రెడీ కావాలని సూచించారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ఐఓసీ సంస్థ క్రీడలను నిర్వహించాలనే పట్టుదలతోనే ఉంది. అయినా క్రీడలు జరుగుతాయా?లేదా?అనే సందిగ్ధత క్రీడా సంఘంలోనూ, క్రీడాకారులలోను అనుమానం కొనసాగుతూనే ఉంది. అయినా ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ జరుగుతాయని, దానికి భారత్ సన్నద్ధంగా ఉంటే మంచిదని భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షుడు నరేందర్ బాత్రా కూడా స్పష్టం చేశారు.