ప్రపంచంలో అత్యంత క్రూరమైన జీవాలలో మొసలి కూడా ఒకటి. దాన్ని దాని ఆకారాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుంది. ఎవరైనా మొసలిని చూస్తే.. వారికి కాళ్లు చేతులు వణికిపోతాయి. అవి తమ పదునైన పళ్లతో ఒక్కసారి పట్టుకుందంటే.. చీల్చి పాడేస్తుంది. అయితే, కేరళలోని ఆ ఆలయంలోకి వచ్చిన మొసలిని చూసి.. పూజారి కంగారు పడలేదు. భయంతో అటవీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఆ మొసలికి నమస్కారం పెట్టి బయటకు వెళ్లాలని కోరాడు. అంతే.. ఆ మొసలి ఆయన విని బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే, ఈ మొసలి క్రూరమైనది కాదు. మనుషుల మాట వింటుంది. మనుషుల కోసమే బతుకుతోంది. మాంసాహారం కూడా ముట్టదు. కసరగడ్ జిల్లాలో గల అనంతపురలో గల ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో జీవిస్తున్న ఈ శాఖాహార మొసలిని ‘బలియా’ అని పిలుస్తారు.


నిత్యం ఆ ఆలయానికి కాపాలా కాస్తుంది. రోజూ గుడిలో ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని తీసుకోదు.
ఇన్నాళ్లలో ఈ మొసలి ఏ రోజు ఆలయం లోపలికి రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మొసలి ఆలయంలోకి ప్రవేశించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, కొందరు మొసలి గర్భగుడిలోకి ప్రవేశించిందని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని చంద్ర ప్రకాష్ పేర్కొన్నారు.


ఈ మొసలి ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. దీని గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీ విష్ణువు కోసం ఘోర తపస్సులో ఉన్న విల్వమంగలతు స్వామి భక్తిని పరీక్షించేందుకు బాలుడి రూపంలో వస్తాడు. విల్వమంగలతుతో పరాచకాలు ఆడతాడు. దీంతో, విల్వమంగలతు ఆ బాలుడిని పక్కకు నెట్టేస్తాడు. తన తప్పును తెలుసుకునేసరికి కృష్ణుడు ఓ చిన్న గుహాలోకి వెళ్లిపోతాడు.

ఆ గుహ ఈ ఆలయంలోనే ఉందని, దానికి కాపలాగా విల్వమంగలతు ఈ మొసలిని ఏర్పాటు చేశాడని చెబుతుంటారు.సుమారు 70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో ఆలయానికి కాపలాగా ఉన్న మొసలిచి చంపేశాడు. అయితే, అతను కొద్ది రోజుల తర్వాత పాము కాటుకు గురై చనిపోయాడు. దైవమే అతన్ని చంపిందని స్థానికులు చెబుతుంటారు.


చిత్రం ఏమిటంటే.. ఆ మొసలి చనిపోయిన కొద్ది రోజులకే మరో మొసలి వచ్చింది. అలా.. కొన్నేళ్లుగా ఒక మొసలి చనిపోయిన వెంటనే మరో మొసలి ప్రత్యక్షమవుతూ గుడికి కాపలాగా ఉంటున్నాయి. నిజంగా ఇది చిత్రమే అని చెప్పాలి.. ఇలాంటి మరిన్ని వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ప్రపంచంలో జరుగుతున్న ఏ విషయాలనైనా తెలుసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: