
రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల మరియా అనే మహిళ 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిని పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అప్పటికే ఆ వ్యక్తికి పదేళ్ల బాబు ఉన్నాడు. పదేళ్ల కాపురం తరువాత మరియా తన భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, కొడుకు వ్లాదిమిర్ తన సవతి తల్లి మరియాను విడిచి ఉండలేకపోయాడు. ఆమెను తరచూ కలిసేవాడు. దీంతో ఆమెకు అతడి ప్రవర్తనలో మార్పు కనిపించింది.
ఈ క్రమంలోనే మరియాకు తన కొడుకు తనపై చూపిస్తున్న ప్రేమ గురించి అర్థమైంది. అది తల్లి కొడుకుల అనుబంధం కాదని, అంతకు మించి అని అర్థం చేసుకుంది. అదే విషయాన్ని వ్లాదిమిర్‌కు కూడా చెప్పింది. ఇద్దరం కలిసి జీవిద్దామని, పెళ్లి చేసుకుందామని మరియా చెప్పడంతో వ్లాదిమిర్ తెగ ఆనందపడిపోయాడు.
ఇద్దరు వివాహం చేసుకున్నారు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక తండ్రి కూడా ఒకే చెప్పాడు. సవతి కొడుకును వివాహం చేసుకున్న మరియా కొన్నిరోజులకు గర్భవతి అయ్యింది. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ విషయంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తూ.. తల్లి, బిడ్డల మధ్య ఉన్న సంబంధానికి కళంకం తెచ్చిపెట్టావంటూ మండిపడుతున్నారు. కానీ మరికొంత మంది మాత్రం అతడు సవతి కొడుకని, అందులోనూ భర్తతో విడాకులు తీసుకోవడంతో ఆమెకు ఆ కుటుంబానికీ సంబంధం లేకుండా పోయిందని, ఇప్పుడు వారిద్దరి మధ్య తల్లీ, కొడుకుల సంబంధం లేకపోవడం వల్ల వారు పెళ్లి చేసుకున్నా తప్పేమీ కాదని మద్దతుగా మాట్లాడుతున్నారు.