అయితే ఇంతటి ఫేమస్ అయిన సోనుసూద్ ను అస్త్రంగా వాడుకున్నారు సైబర్ నేరగాళ్లు. సాధారణంగా సైబర్ మోసగాళ్లు డబ్బుల కోసం చేసే ఎన్నో విధానాలు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు డబ్బులు ఆర్జించేందుకు గాను సోను సూద్ ను టార్గెట్ చేశారు. సోను సూద్ ప్రజలకు సహాయం చేసే పాపులారిటీని అడ్డం పెట్టుకుని బడా ప్లాన్ వేశారు సైబర్ నేరగాళ్లు. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి సోనూ సహాయం పొందాలంటే.. ముందుగా తనను సంప్రదించి వివరాలు తెలపాలంటూ సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. దీంతో.. అది నమ్మిన ప్రజలు. సహాయం పొందడానికి గానూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అందుకోసం కొంత ఫీజు చెల్లించాలని నమ్మించి ప్రజల వద్ద నుండి వసూళ్లు మొదలు పెట్టాడు.
అయితే రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించిన వారికి ఎటువంటి సహాయం అందకపోవడంతో అనుమానమొచ్చి పోలీసులను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని కనుక్కున్నారు. నిందితుడు బీహార్ వాసిగా గుర్తించారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటిని నమ్మే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం ఇతరులను అడిగి తెలుసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఇలాంటి వాటిపైన అవగాహనా కలిగి ఉండాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి