మొన్నటివరకూ పెళ్ళి, ఏ ఇతర శుభకార్యాలు జరగాలంటే కరోనా నిభంధనలు తప్పక పాటిస్తున్నారు.. తర్వాత వ్యాక్సిన్ అందుబాటులొ కి వచ్చిన తర్వాత కరోనా నిబంధనల లో సడలింపులు రావడం తో పెళ్ళిళ్ళు, పంక్షన్లు యదావిదిగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన పెళ్లిళ్లు కొన్ని వైరల్ అయ్యాయి. కరోనా భయం తో చాలా మంది పెళ్ళికి రాకండి అంటూ పెళ్ళి పత్రికలు వేయిస్తే.. మరి కొంతమంది బంధువుల కు ఇంటి వద్దకె భొజనాన్ని పంపించే వారు. అలా కొన్ని ప్రయత్నాలు కరొనను తగ్గించడంలోనూ సహాయపడ్డాయి..


ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో పెళ్ళి కార్డు జనాలను ఆకర్షిస్తుంది. ఆధార్ కార్డును పోలిన విధంగా ఆ పత్రిక వుంది. మనకు చూడగానే అది అర్థం కాదు.. కానీ చూడగానే ఎదో వుంది అనెలా ఉండటం విశేషం.. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఛత్తీస్‌గఢ్‌ లోని యశ్‌పూర్‌ జిల్లా, ఫర్‌సభ సమితి, అంకిరా గ్రామాని కి చెందిన లోహిత్‌ సింఘ్‌ కాస్త వినూత్నంగా ఆలోచించాడు.అతని ఆలొచనకు కుటుంబం సహకారం కూడా ఉండటంతో అతని మరింత ఫెమస్ అయ్యాడు.


విషయాన్నికొస్తే.. ఆధార్‌ తరహా లో తన పెళ్లి కార్డ్‌ను ప్రింట్‌ చేయించి, బంధుమిత్రులకు పంచి పెట్టాడు. పెళ్లికి విచ్చేసే వారంతా ముఖానికి మాస్క్‌ ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని పిలుపునిస్తూ శుభలేఖలో పేర్కొనడం విశేషం. ఆ కార్డు చూడటాని కి బార్‌ కోడ్‌ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్‌ లో ఆధార్‌ నంబరు స్థానం లో పెళ్లి తేది, అడ్రస్‌ స్థానంలో ఆచరించాల్సిన కోవిడ్‌ నియమాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణీయం గా మారింది.. ఈ కార్డు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.. గతం లో ఇలాంటి కార్డులు సోషల్‌మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: