పొగ త్రాగటం అనేది చాలా ప్రమాదకరమని అందరికీ కూడా తెలుసు. ఈ అలవాటు మన ప్రాణానికే చాలా ప్రమాదం. ఆ విషయం ధూమపానం చేసేవారికి కూడా తెలుసు.థియేటర్లలో ఇంకా సినిమాలలో కూడా ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం,ఇది ఖచ్చితంగా క్యాన్సర్‌కు కారణమవుతుందని కూడా మనం చాలా సార్లు వింటుంటాం.కానీ మానేయండి అని చెప్పటం ఈజీ కానీ ఈ అలవాటు మానేయడం మాత్రం ఖచ్చితంగా చాలా కష్టం.ఎందుకంటే ధూమపానం వల్ల పొగ తాగే వారికే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి.ఇవి అన్ని తెలిసి కూడా.. పురుషులే కాదు స్త్రీలు కూడా చాలా మంది ఈ ధూమపానం చేస్తారు. అయితే ఓ భార్య తన భర్తకు పొగ తాగడానికి సహాయం చేయడం మాత్రం ఎప్పుడైనా చూశారా? భర్త ధూమపానం గురించి అనేక సార్లు ఫిర్యాదు చేసే ఆడవాళ్లను మనం ఇదివరకు చూశాం..అతనిని ఆపడానికి ప్రయత్నించే భార్యల బాధల గురించి కూడా చాలానే విన్నాం. కానీ, పొగ త్రాగడానికి సహాయం చేసే భార్యను మాత్రం ఎక్కడా చూడలేదని చెప్పాలి. కానీ, ఈ ఇల్లాలు మాత్రం గొప్ప హృదయం కలది.


దానికంటే భర్తని అర్ధం చేసుకునే భార్య అని చెప్తే ఇంకా బాగుంటుంది.ఎందుకంటే..తన భర్త బైక్‌ నడుపుతుంటే ఆమె అతనికి సిగరెట్‌ తాగిస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌ అవుతోంది.ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా.. ఓ జంట స్కూటర్‌పై వెళుతున్నారు.ఆ బైక్‌పై వెనుక వైపు కూర్చున్న మహిళ ఒక చేతిలో జెండా లాంటిది పట్టుకుని ఉంది.. ఇంకా మరోవైపు సిగరెట్ పట్టుకుని ఉంది. ఇక స్కూటర్ ముందు వారి పిల్లాడు కూడా కూర్చున్నాడు. ఇదంతా కూడా పక్కన ప్రయాణిస్తున్న కారు ప్రయాణికులు వీడియో తీయడం జరిగింది. ఆ బైక్‌ నడుపుతూనే అతడు సిగరెట్ అడుగుతున్నట్లు ముఖం తిప్పేస్తాడు. ఇక అతని భార్య అతని నోటికి సిగరెట్ అందిస్తుంది. అతడు పఫ్ తీసుకున్న తర్వాత ఆమె మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. పదే పదే అతడికి సిగరెట్‌ పఫ్‌ అందిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: