ఇండియాలో ఉంటే ప్రతి పౌరుడికి కూడా తమ కరెన్సీ నోట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగ మనదేశంలో ఎలాంటి నోట్లు ఉంటాయి ఎలాంటి కాయిన్స్ ఉంటాయో కూడా మనకి బాగా ఐడియానే ఉన్నది.. కానీ ఎప్పుడైనా మనం సున్నా రూపాయి నోటుని చూడడం చాలా తక్కువ ఈ పదం వినేది కూడా మొదటిసారి కావచ్చు.. కచ్చితంగా మనలో కేవలం ఒక్క రూపాయి నోటు నుంచి చాలామంది మాత్రమే చూసే ఉంటాము.. సున్నా రూపాయ నోటుని ఎప్పుడు చూసి ఉండము.. అయితే ఇది వింతగా అనిపించినప్పటికీ మన దేశంలో సున్నా నోట్లను కూడా ముద్రించినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.


అసలు ఈ నోటు ఎందుకు ముద్రించారు అనే విషయానికి వస్తే.. సున్నా రూపాయి నోటును 2007 లో NGO ముద్రించారు. ఈ నోటు పైన ప్రభుత్వం లేదా రిజర్వు బ్యాంకు నుంచి ఎలాంటి గుర్తింపులు కనిపించలేదు.. పైగా ఈ సున్నా రూపాయి నోటు ఎప్పుడు కూడా చలామణిలో లేదట.వేళల్లో నోట్లను పంపిణీ చేయడం ద్వారా ఈ నోట్ తో ఏదైనా విశిష్ట సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉండేవారట.. అంతేకాకుండా ఈ నోట్ తమిళ్ ,హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో మాత్రమే ముద్రించారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి ఎక్కువగా ఉండేదని.. దీంతో ప్రతి వాటికి సామాన్యుల సైతం ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి వచ్చిన సందర్భంలో లంచం మరియు అవినీతికి చాలామంది పాల్పడుతూ ఉండడంతో ఈ సున్నా రూపాయి నోటుని ముద్రించారట. ఈ నోటును రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో అతికించి పంపిణీ చేసేవారట. అవినీతిని నిర్మూలించేందుకే అవగాహన కల్పించేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడింది. ఈ సున్నా రూపాయి నోటు సరిగ్గా చూస్తే 50 రూపాయలు నోట్లు లాగానే కనిపిస్తుంది. ఈ నోటు పైన నేను ఎప్పుడూ లంచం ఇవ్వను లంచం తీసుకొని అనే విధంగా ముద్రించారు. ఈ నోట్లు దాదాపుగా 25 వేల నోట్లో ముద్రించారు. చివరిగా 2014 వరకు మాత్రమే ఈ నోటు బాగా పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: