కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన ఆ వీడియోపై ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఆ ఉపాధ్యాయురాలు డ్యాన్స్ చేసిన తీరు "సిగ్గుమాలిన టీచర్" అని అంటున్నారు. ఒక 'X' యూజర్ కామెంట్ చేస్తూ "ఇంతకంటే పెద్ద సిగ్గుచేటు ఏముంటుంది? ఒక ఉపాధ్యాయురాలు స్వయంగా ఇలాంటి పాటలకు డాన్స్ చేయడం, అదీ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం రోజున!" అని మండిపడ్డాడు.
"ఇలాంటి స్కూళ్లు ఉంటే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి?" అని మరొక 'X' యూజర్ అడిగారు. అలాగే, చాలామంది ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. "ఆలోచించండి.. చదువు స్థాయి ఎంత ఉంటుంది? ఉపాధ్యాయ దినోత్సవం రోజున భోజ్‌పురి పాటలకు డాన్స్ చేయడం అంటే!" అని మరొక యూజర్ అభిప్రాయపడ్డారు.
ఇంకో రీసెంట్ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు ఒక బాలీవుడ్ పాటకు డాన్స్ చేస్తున్నారు. ఈ డాన్స్ చాలా అశ్లీలంగా ఉందని, చిన్న పిల్లలకు ఇలాంటివి చూపించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోలో 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసున్న పాఠశాల బాలికలు 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కి రాత్' అనే పాటకు డాన్స్ చేస్తున్నారు. మొత్తం మీద స్కూల్లో ఇలాంటి చెత్త డాన్సులు చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.