ఇంకొందరు రాత్రి సమయంలో వంతెనల మీదకి ఎక్కి ధ్యానం మొదలు పెడతారు. కొందరైతే వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని దాటుతామని రిస్క్ తీసుకుంటారు. అంటే ఓసారి వారి శరీరంలోకి ఈ ‘లిక్విడ్ మెడిసిన్’ వెళ్లిపోయిన తర్వాత వారు చేసే పనులు పూర్తిగా ఊహకు అందవు. కానీ ఇక్కడితో ముగిసిపోయిందనుకుంటే పొరపాటు. కొంతమంది స్ర్కిప్ట్ రైటర్స్‌కు కూడా రాని ఐడియాలు డ్రింకర్స్‌కు వస్తాయి, ముఖ్యంగా మిక్సింగ్ విషయంలో. ఎవరు ఊహించని విచిత్రమైన కాంబినేషన్లు ట్రై చేస్తూ తమ ‘సైన్స్’ చూపిస్తారు.తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి చీప్ లిక్కర్ ఒక పెగ్ పోసుకుని… అందులో వాటర్ లేదా సోడా కాకుండా నేరుగా కొబ్బరి నీరు మిక్స్ చేశాడు. మందు ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. కొబ్బరి నీళ్లు మాత్రం ఆరోగ్యానికి మంచివి అనేది అందరికీ తెలిసిందే. సో… అతని ఆలోచన ప్రకారం, “మందు వల్ల ఆరోగ్యం పాడవకుండా… ఇటు హెల్త్ దొరకాలి, అటు కిక్ కూడా తగ్గకూడదు” అన్నట్టుగా ఈ రెండు ‘అద్వితీయ ద్రావకాలను’ కలిపేశాడు. ‘ఆరోగ్యానికి ఆరోగ్యం… కిక్కుకి కిక్కు!’ అంటూ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా ఊహాతీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సరదాగా,“ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? సిగ్గుపడండి!”అని ‘జీనియస్ మార్క్’ పెట్టేశారు. ఇలా ఈ కొత్త తాగుబోతు టెక్నిక్ ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తాన్ని నవ్వుల పంట పండిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి