ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. అంటే మనము బ్రతుకుతున్న దానికి ఒక అర్ధం ఉండాలి. ఎవరైతే లక్ష్యంతో సాగుతారో అలాంటి వారే గమ్యానికి చేరుకుంటారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సరైన ప్రణాళిక అవసరం.  ఎటువంటి ప్రణాళిక లేకుండా లక్ష్యం గురించి కలలు కంటే అది ఒక ఆశ గానే మిగిలి పోతుంది. మీరు ఈ లక్ష్యాన్ని చేరుకునే సమయంలో సంస్కృతి, విలువలు, విశ్వాసాలు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వీటి తరువాత ఆత్మ విశ్వాసం, మానవ ప్రయత్నం, సాహసం, ధైర్యం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి మీ లక్ష్యంలో ప్రధానంగా ఉంటాయి. 

ఈ జీవితం అనేది ఏమిటి...మీ జీవితంలో మీరు గెలవడమే జీవితానికి మీరిచ్చే గొప్ప బహుమతి. గెలవడం అంటే...మీరు అనుకున్న జీవితాన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోవడం. మొదటగా జీవితమంటే ఏమిటో తెలుసుకోండి. జీవితం అనేది ఒక విభిన్న రుచుల వంటకం...విభిన్న కథల గ్రంధం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోలికలు.  తనను తాను గెలుచుకోవడమే జీవితం. తన జీవితానికి తానే కర్త కర్మ క్రియ అని తెలుసుకొని ఆచరించడమే జీవితం. తనను తాను మలుచుకోవడమే జీవితం. తనను తాను గౌరవించుకోవడమే జీవితం. తనను తాను ఎదిగించుకోవడమే జీవితం. 

తన లక్ష్యాలు, గమ్యాలు సాధించుకోవడమే జీవితం. అవి సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉండడమే జీవితం. నీ జీవితానికి నువ్వే దారి వేసుకోవాలి. నీ దారి నువ్వే చూసుకోవాలి. కాబట్టి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకు. నిన్ను చూసి పది మంది ఆ దారిలో నడిచేలా నువ్వు బ్రతుకు. లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎన్నో అవరోధాలు ..ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ వాటన్నింటినీ సరిగ్గా ఎదిరించి నిలబడి విజయం వైపు నీ అడుగు వేయాలి. ఇలా జీవితంలో మీ లక్ష్యాన్ని సాధించాలి. అంతే కానీ ఏ లక్ష్యం లేకుండా దయచేసి బ్రతకొద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: