జీవితమనే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. మన జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం, కలుస్తాం మరియు మాట్లాడుకుంటాం. కానీ ఎవరో ఒకరు మాత్రమే మన హృదయానికి కనెక్ట్ అవుతారు అదే ప్రేమ యొక్క మిరాకిల్. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రేమతో ఒకటి అయ్యేవారు ఎంతమంది ఉన్నారో, తమ ప్రేమలో నిజాయితీ లేదని బ్రేకప్ చెప్పుకునేవారు అంతకుమించే ఉన్నారు. అయితే ఇక్కడ చాలామందికి తలెత్తే ప్రశ్నలు ఏమిటంటే ? నిజమైన ప్రేమను ఎలా గుర్తించాలి ? అవతలి వాళ్లు మనతో ప్రేమను నటిస్తున్నారా ? లేక మనమే వారిని సరిగా అర్థం చేసుకోకుండా దూరం చేసుకుంటున్నామా ? ఇలా ఎన్నో ప్రశ్నలు వేధిస్తుంటాయి.

అయితే కొన్ని అంశాలను బట్టి అవతలి వారు మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా, ఎన్ని కష్టాలు ఎదురైనా చివరి వరకు నీకు తోడుగా నిలవాలనే ఆలోచన వారికి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీతో ప్రవర్తించే విధానాన్ని బట్టి వారిది నిజమైన ప్రేమా కాదా అన్నది తెలుసుకోవచ్చు.  వారు మీతో చనువుగా  ఉండటమే కాకుండా తనకి సంబంధించిన అన్ని విషయాలను మీతో సంకోచం లేకుండా షేర్ చేసుకుంటున్నట్లు అయితే వారి ప్రేమలో నిజాయితీ ఉన్నట్లే. అదే విధంగా మన కుటుంబ సభ్యులు బయటివారు వచ్చినప్పుడు వారికి ఎక్కువ గౌరవ మర్యాదలు చేస్తూ మనల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోమనే విధంగా మాట్లాడతారు. ఇదే ప్రవర్తన మిమ్మల్ని ప్రేమించే వారిలో కూడా ఉన్నట్లయితే అంటే మిమ్మల్ని బయట వారిలా చూడకుండా ఇంట్లో సభ్యులగానే పరిగణిస్తే అది మీ అదృష్టమనే చెప్పాలి.

కానీ ఈ భావన చాలామందికి అర్థం కాదు. తమని తక్కువ చేసి చూస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ అది మన అనుకునే భావన అని అర్థం చేసుకోవాలి. అలాగే మన సంతోషాన్ని పంచుకోవడమే కాకుండా కష్టనష్టాలలో కూడా మనకు అండగా నిలబడి బాధ్యత తీసుకోగలగాలి. నిజమైన ప్రేమ చిహ్నాలలో త్యాగం కూడా ఒకటి . మీ కోసం అవసరమనిపిస్తే ఎంత విలువైనది అయినా త్యాగం చేయగలగాలి. ఇలా ఈ క్వాలిటీస్ వారిలో కనిపిస్తే అది మీపై నిజమైన ప్రేమ ఉందని తెలిపే గుర్తు. కాబట్టి ఎవరి ప్రేమ నిజమో ఎవరిది బూటకమే తెలుసుకో... మోసపోకు.

మరింత సమాచారం తెలుసుకోండి: