దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత. యువత తలచుకుని నడుం బిగిస్తే చరిత్రలు తిరగరాయొచ్చు. ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అంతటి శక్తి యువతకి ఉంది. అలాంటి యువత పక్క దారి పడితే ఇక వారి భవిష్యత్తే కాదు. దేశ అభివృద్ధి కూడా కుంటుపడినట్లే. యువతరం సంకల్పించాలే కానీ సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఉదాహరణకు ప్రపంచంలో వివిధ రంగాలకు చెందిన విశ్వనాథన్‌ ఆనంద్‌, ఆదిశంకరాచార్య, చెగువేరా, స్టీవ్‌ జాబ్స్‌, సచిన్‌ టెండుల్కర్‌
స్వామి వివేకానంద వంటి వారంతా యువకులుగా ఉన్నప్పుడే వారి లక్ష్యాలను సాధించి తమ వివిధ రంగాలలో రాణించి వారి ముద్రను వేసుకున్నారు.  

ఏకాగ్రత, సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలే కానీ విజయం మీ వెంటే ఉంటుంది.  విజయం అందుకోవాలనుకునేవారు కింద తెలిపే ప్రధానమైన చిట్కాలను దృష్టిలో ఉంచుకోవాలి. యుక్త వయసులో పలు విషయాలకు యువత ఆకర్షితులవుతుంటారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం వలన అది ఎంతగా అయితే వారికి ఉపయోగపడుతుందో చెడు కోణాల వైపు కూడా అంతే ఆకర్షిస్తుంది. అయితే ఏదైనా సరే అన్ని మన చేతి లోనే ఉంటాయి. చెడుని ఎంచుకోవాలన్నా మంచి మార్గాన్ని ఎంచుకుని విజయాన్ని అందుకుని అందరి లోనూ మిన్నగా అందరి చేత మన్నలను పొందాలన్న నిర్ణయం మొదట మీ చేతిలోనే ఉందని తెలుసుకోండి.

తల్లితండ్రులు కూడా యుక్త వయసులో ఉన్న తమ పిల్లలను ఈ సమయంలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సరైన సమయంలో మార్గనిర్దేశం చేయాలి. పిల్లలు కూడా తల్లి తండ్రుల మాటకు గౌరవం ఇచ్చి వారి మాటలను విని చెప్పినట్టు నడుచుకోండి. ఎందుకంటే వారి అనుభవంతో నేర్చుకున్న గుణపాఠాలను మీకు సందేశాలుగా చెబుతారు వాటిని విని వారిని అర్దం చేసుకుని ఫాలో అయితే మీ భవిష్యత్ ఇక బంగారు మయమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: