ఈ సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. కానీ మనతో వారు కలిసి ఉండే విధానాన్ని బట్టి మనకు కూడా వారితో మెలుగుతాము. అయితే కొన్ని విషయాలను మనము ఇతరుల దగ్గర నుండి నేర్చుకుని అలవర్చుకోవాలి. అదే విధంగా మరికొన్ని విషయాలను ఇతరులను చూసి వదిలేసుకోవాలి. అటువంటి విషయాలలో అతి భయంకరమైన విషయం ఏమిటంటే... "అహం". ఈ ఒక్క లక్షణం మీలో ఉంటే మీ జీవితం అంతా తలక్రిందులుగా మారిపోతుంది. అందుకోసం ఈ లక్షణానికి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మానసిక వైద్యులు సలహాలు ఇస్తుంటారు. అయితే కొందరిలో వారికి కూడా తెలీయకుండానే ఈ లక్షణం ఉంటుంది. అయితే మీలో కూడా ఈ లక్షణం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలంటే కింద విషయాలు ఒకసారి తెలుసుకోండి.

మనుషులందరూ సమానమే. కులం, మతం, ధనికులు, పేదలు అందరిలోనూ ప్రవహించేది ఒకే రక్తమే. కానీ చాలా మంది మేము ధనవంతులం అని కొందరు మేము చాలా తెలివైన వారు అని గర్వపడుతుంటారు. ఏదో సాధించాం కదా అని తమ విజయ గర్వం ఇతరులపై చూపుతూ వారిని చులకనగా మాట్లాడుతుంటారు. ఆ గర్వంతో ఆ అహంభావంతో ఇతరులను తక్కువ చేసి చూస్తుంటారు. ఇతరులను తమ మాటల్తో చేతలతో బాధపడుతుంటారు. ఈ వైఖరి వలన మీరు సాధించిన విజయానికి విలువ ఉండదు. ఆ విజయం మీ గౌరవానికి ఆభరణం కావాలే కానీ..అది మీలో అహంభావాన్ని పెంచే సాధనం కాకూడదు.

అలాంటి విజయం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.  విజయం ఎపుడు కూడా మీకు ఉపయోగపడేది, మీకు ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే కాదు, ఆ విజయం మీకు నలుగురిలో గుర్తింపుతో పాటు గౌరవాన్ని కూడా అందించేదిగా ఉండాలి. నలుగురికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి, మీతో పాటుగా మీతోటి వారికి సైతం సంతోషాన్ని పంచేదిగా ఉండాలి.  మీలో కనుక అహం భావం ఉన్నట్లయితే వీలయినంత త్వరగా ఆ భావాన్ని మీలో నుండి తొలగించడానికి ప్రయత్నించండి. మీలోని ఆ లక్షణాలను నెమ్మది నెమ్మదిగా తీసివేయడానికి ఇది ఉందా మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మిమల్ని పాతాళానికి లాగేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.. అహం ఒకవేళ ఇప్పటికే మీలో ఉంటే మెల్ల మెల్లగా దానిని పారద్రోలండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: