కోటిరెడ్డి సరిపల్లి.. ఇది పేరు కాదు.. నిరంతరం జ్వలించే మేథోజ్యోతి.. మనిషిగా పుట్టినందుకు మనం ఏం చేయాలి.. నేను, నా కుటుంబం, నా గ్రామం, నా ప్రాంతం, నా రాష్ట్రం.. ఇలా గీతలు గీసుకోకుండా విశ్వమానవాళి కోసం ఏం చేయాలి.. ఎదురైన సవాళ్లను అవకాశాలుగా ఎలా మలచుకోవాలి.. ఇలా సాగే ఆలోచనాసరళే కోటిరెడ్డిని ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్తను చేసింది. గుడివాడ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ ఆయన జీవన ప్రస్థానం సాగినా.. ఆయన నోట అచ్చతెలుగు భాష కమనీయంగా వినిపిస్తుంది. కోట్లాది రూపాయల సంస్థలకు అధిపతి అయినా ఆయన మాటల్లో సంస్కారం ఉట్టిపడుతుంది.


ఎంత ఎదిగినా ఒదిగిఉండటం.. పెద్దల పట్ల గౌరవభావం కలిగి ఉండటం.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. చిన్న చిన్న అంశాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం.. తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపట్ల అమితమైన ప్రేమ కనబరచడం.. ఇన్ని మంచి లక్షణాలు ఓ పారిశ్రామికవేత్తలో ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తే కోటీ గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్ అధినేత స‌రిప‌ల్లి కోటిరెడ్డి.


కోటిరెడ్డి జీవితం పట్టుదలతో అసాధ్యాన్ని సాధ్యం చేసిన విజయగాథ. కృష్ణా జిల్లా జనార్థనపురంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కోటిరెడ్డి, కేవలం పదో తరగతి అర్హతతో మైక్రోసాఫ్ట్‌లో కీలక పదవి సాధించారు. గుడివాడలో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన ఆయన, హైదరాబాద్ నుంచి అమెరికా వరకు తన ప్రయాణాన్ని విస్తరించారు. మైక్రోసాఫ్ట్, డెల్‌లో ఉన్నతోద్యోగాలు సాధించినా స్వదేశంపై మమకారంతో భారత్‌కు తిరిగొచ్చి కోటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను స్థాపించారు.

కోటిరెడ్డి స్థాపించిన భారత్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, ఇండియా హెరాల్డ్ పబ్లికేషన్స్  సంస్థలు సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. రూ.750 జీతంతో కెరీర్ ప్రారంభించిన ఆయన, నేడు రూ.750 కోట్ల టర్నోవర్‌తో టెక్ దిగ్గజంగా ఎదిగారు. కోటి ఫౌండేషన్, సేవా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు అందిస్తూ, నలుగురికి మేలు చేయాలనే ఆయన జీవన సూత్రం వసుధైక కుటుంబం నినాదంలో ప్రతిఫలిస్తుంది. ఆయన సంస్థలు వేలాది కుటుంబాలకు ఉపాధి, సామాజిక సేవలు అందిస్తూ తెలుగు యశస్సును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్నాయి. కోటిరెడ్డి జీవితం ఒక వ్యక్తి సాధించిన విజయం మాత్రమే కాదు, సమాజానికి ఆదర్శంగా నిలిచిన సందేశం. అందుకే ఇలాంటి బిడ్డను చూసి ఆ తెలుగు తల్లి కూడా మురిసిపోతుందంటే అతిశయోక్తి కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: