కార్తీక మాసం కదండీ.. ఎంతో మాంసం ప్రియులు ఇప్పుడు ముక్క తినలేరు. ఎందుకంటే వాళ్ళు తినాలి అనుకున్న ఇంట్లో పెద్దలు మూతి మీద కొడుతారు కాబట్టి.. అలాంటి వారు మాంసం కాకుండా మాంసం రుచి వచ్చే పన్నీర్ కర్రీని మాంసంల చేయించుకోండి.. ఆ ఇది అందరికి తెలిసిన వంటకమే అండి కాకపోతే పన్నీర్ ని మాంసంల ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 


కావాల్సిన పదార్ధాలు.. 


పన్నీరు ముక్కలు - 150 గ్రాములు, 


చీజ్‌ - 30 గ్రాములు, 


పన్నీరు తురుము - 30 గ్రాములు, 


అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 10 గ్రాములు, 


నూనె- 25 గ్రాములు, 


చికెన్ మసాలా-  1 టీ స్పూన్‌, 


ధనియాల పొడి- 1/2 టీ స్పూన్‌, 


గరం మసాలా- 1టీ స్పూన్‌, 


కారం, మెంతి పొడి- ఒకటిన్నర టీ స్పూన్‌,


బటర్‌ - 10 గ్రాములు, 


మీగడ - 2 టేబుల్‌ స్పూన్లు, 


ఉప్పు- తగినంత, 


తరిగిన ఉల్లిపాయ - మూడు, 


తరిగిన టొమాటో - నాలుగు, 


పసుపు, జీడిపప్పు - 35 గ్రాములు, 


జీలకర్ర - 10గ్రాములు.


తయారీ విధానం..

పాన్‌లో నూనె వేసి కొన్ని ఉల్లిముక్కలు వేసి అందులో జీడిపప్పు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమం వేగాక మిక్సీజార్‌లో వేసి పేస్ట్‌ చేయాలి. టొమాటో సాస్‌ కోసం ఒక పాన్‌లో నూనె వేసి టొమాటో ముక్కలు, 25 గ్రాముల జీడిపప్పు వేసి వేగించాక పేస్ట్‌ చేయాలి. పన్నీర్‌ మసాలా తయారీకి ఒక పాన్‌లో 10 గ్రాముల నూనె వేయాలి. అది వేడెక్కాక వంద గ్రాముల ఉల్లిముక్కలు వేసి వాటిని వేగిస్తూ జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్‌,చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, కారం, మెంతి పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. దీన్ని వేగిస్తూ ఉల్లి, టొమాటో గ్రేవీలను కలపాలి. రెండు నిమిషాల తర్వాత పన్నీరు ముక్కలు వేయాలి. కొద్దిసేపయ్యాక చీజ్‌, తురిమిన పన్నీర్ కలిపి స్టవ్‌ మీద నుంచి దింపేటప్పుడు బటర్‌, క్రీమ్‌ వేస్తే పన్నీర్‌ చికెన్ మసాలా రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం కార్తీక మాసంలో చికెన్ లాంటి పన్నీర్ కర్రీని లాగించేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: