రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు.ఈ నల్లటి వలయాలు తగ్గాలంటే గులాబీ నీళ్లలో కొంచెం దూదిని ముంచి కళ్ల కింద పెట్టుకుంటే ఆ వలయాలు ఇట్టే మాయమవుతాయి.బయటకు వెళ్ళినప్పుడు కాలుష్యం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. ఫేస్‌వాష్ చేసుకున్నా మురికి వదలదు. అందుకే ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడిస్తే చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ట్యాన్ పోతుంది. అంతేకాదు మొటిమలున్న వారు రోజూ గులాబీ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మరవద్దు. ఒక బాటిల్లో రోజ్ వాటర్ నింపి, అందులో రెండు మూడు చుక్కల బాదం ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రిఫ్రిజరేటర్లో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి ఈ సొల్యూషన్ ను ముఖానికి స్ప్రే చేసుకోవాలి. కొంచెం సేపు అలాగే ఉంచి తర్వాత తుడుచుకుంటే సరి..Df
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి