సాధారణంగా ప్రతి మనిషికి కాఫీ,టీ తాగడం అలవాటు. పురుషుల్లో టీ ఎలా తాగుతారో.. స్త్రీలలో చాలా మంది అలానే టీ, కాఫీలు తాగేస్తుంటారు. కాఫీ తాగడం వల్ల మూడ్ రిఫ్రెష్ అవుతుందని, ఎలాంటి వర్క్ ప్రెషర్ ఉన్నా.. కాసింత కాఫీ తాగితే తలనొప్పి తగ్గి పని చేస్తామని చాలా మంది భావిస్తుంటారు. అయితే కాఫీ విషయంలో జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. అందేంటంటే.. పురుషుల కంటే మహిళలు కాఫీ ఎక్కువగా తాగితే సంతానోత్పత్తి సమస్య ఏర్పడుతుందని, తద్వారా పిల్లలు పుట్టే యోగ్యం ఉండదన్నారు.

గర్భిణులు తీసుకునే ఆహారం పుట్టబోయే పిల్లడిపై ప్రభావం చూపుతుంది. కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్న మహిళ.. గర్భిణి అవ్వాలనుకునే దశలో వీటిని తాగడం పూర్తిగా మానుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాఫీ ఎక్కువ తాగడం వల్ల గర్భం ధరించే ఛాన్సులు తక్కువగా ఉంటాయన్నారు. రోజుకీ రెండు కప్పుల కాఫీ తీసుకునే వారిలో ఆరోగ్యానికి మేలు చేసే కెఫిన్ దొరుకుతుందని, అదే కాఫీ మితిమీరితే సంతాన లోపం ఏర్పడుతుందని తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. కెఫిన్ అధికంగా ఉంటే కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లను తాగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందన్నారు.

రోజుకు రెండు కప్పులకు మించి టీ, కాఫీ తాగే అలవాటు ఉన్నవారు తక్షణమే ఈ అలవాటును తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాఫీలు తాగడం వల్ల ఆకలిని తగ్గిస్తుందని, శరీరంలో నీటి శాతం తగ్గుతుందని, కాల్షియం, పోషకాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయని, తద్వారా శరీరంగా నీరసంగా మారుతుందన్నారు. కాఫీలు తాగే అలవాటును తగ్గించుకుని రోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, విటమిన్లు, పోషకాలు లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలన్నారు. గర్భిణులకు ఈ విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవాలన్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి, శరీరంలో ఐరన్ లోపం, పిండం ఎదుగుదల తగ్గి అవరోధం ఏర్పడుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. గర్భిణులు ఎక్కువగా కాఫీ తాగితే పుట్టే పిల్లాడి గుండె బలహీనంగా మారే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: