చిన్నతనం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనాలనే కల ఓ వైపు, మరో వైపు కిడ్నీలు విఫలమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి. ఇదే టోక్యోకు వెళ్లే మూడు నెలల ముందు లవ్లీనా ఉన్న పరిస్థితి. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో దేశం కోసం ఆడాలన్న కసితో తీవ్రంగా శ్రమించి తన తల్లి తో పాటు యావత్ దేశం గర్వించే విజయాన్ని అందుకుంది. టోక్యో ఒలంపిక్స్ లో సెమీఫైనల్  చేరీ పతకం గ్యారెంటీ చేసుకుంది. బాక్సింగ్ లో మెడల్ అందుకోనున్న మూడో బాక్సర్ గా అద్భుతమైన రికార్డు సృష్టించనుంది.

తాను పుట్టి పెరిగిన అస్సాంలోని బోరో ముఖియా గ్రామాన్ని ప్రపంచమంతా చూసేలా చేసింది. ఈ అమ్మాయి చేతిలో గతంలో నాలుగు సార్లు ఓడిపోయిన ఈమె ఈసారి ఎలాంటి బెరుకు లేకుండా పూర్తి సన్నద్ధతతో సిద్ధం అని ఆమె చెప్పింది. ఆ పరాజయాలకు బదులు తీసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నా, ఎలాంటి స్ట్రాటజీ పద్ధతి ఉపయోగించట్లేదు.. ఎందుకంటే ఆమె ఎలా పోరాడుతుంది తనకు బాగా తెలుసు.. ఒత్తిడి లేకపోవడం కలిసి వచ్చింది. సెమీస్ కు ఇంకా సమయం ఉండటంతో ప్రత్యర్థి నీ ఇంకా పరిశీలించి పోటీ పడతాను అని చెప్పింది. 

చిన్నప్పటి నుంచి యుద్ధకళ పై ఆసక్తి పెంచుకున్న లవ్లీనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈమె అస్సాం యువ బాక్సర్ గా ముందుకు సాగింది. టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించింది. జీవితంలో ఎన్నో కష్టాలకు పంచ్ ఇచ్చిన అదే స్ఫూర్తితో ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్ కు చేరింది. ఒలంపిక్స్ లో పతకం సాధించిన మూడో భారత బాక్సర్ గా రికార్డు సృష్టించింది. చిన్నతనంలోనే పతకం సాధించిన జాతీయ చాంపియన్ గా నిలిచింది. ఒలంపిక్స్ లో తొలిసారిగా ఎంపికై తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమె తల్లి అనారోగ్యం బారిన పడింది. కానీ దేశం కోసం ఆడడనికి మళ్లీ బయలుదేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: