హ‌ర్నాజ్ కౌర్ సంధూ..

భార‌తీయ అందం

భార‌తీయం నుంచి వెలుగు చూసిన అందం

మ‌నం చాలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న కిరీటానికి

స‌రితూగిన అందం అని రాయాలి..

అందంలో అమ్మాయిల త‌డ‌బాటు క‌న్నా

ప్ర‌తిభలో అమ్మాయిల  రాణింపే గొప్ప‌ది అని చాటాల్సిన

త‌రుణం..కానీ మ‌నం ఈ త‌ర‌హాలో ఆలోచిస్తామా.?



అందాల పోటీలు ఏం చెబుతాయి అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికిప్పుడు స‌మాధానం వెత‌క‌లేం కానీ.. వీలున్నంత వ‌ర‌కూ అమ్మాయిల కు పోటీలో లేని అందం ఒక్క‌టి త‌ప్పక ఉంటుంది క‌నుక దానిని కాపాడుకోవ‌డం ఉత్త‌మం. ఆ విధంగా అమ్మాయిలంంతా త‌మ‌ని తాము శ‌క్తి రూపాలుగానూ, ఆనంద మ‌య రూపాలుగానూ చూసుకోవ‌డం కూడా ఉత్తమం కావాలి.. ఉత్త అందం ఏం చేసుకుంటా రు.. అందంతో పాటు రాణింపు గుణం.. ఎదుర్కొనే ల‌క్ష‌ణం కూడా ఉంటేనే అందానికో విలువ. విలువ‌లో లేని అందం కార‌ణంగా దే శంలో చాలా మంది ఇళ్ల‌కే పరిమితం అయి పోతున్నారు. క‌నుక భోగ లాల‌స క‌న్నా వ‌స్తు లాల‌స క‌న్నా ఒక విష‌య రాణింపులో భాగంగా అమ్మాయిలు ఎదిగితే త‌ప్ప‌క ఆనందించాలి. ఏ రంగంలో ఉన్న మగువలు అయినా రాణించాల్సింది అందంతో కాదు ప్ర తిభ‌తోనే! అందాల పోటీల‌కు కూడా ప్ర‌తిభ ఓ ప్రామాణిక రూపం క‌నుక ఆ రూపం ను కాస్త‌యినా మ‌నం ఇవాళ అర్థం చేసుకోవాలి. కేవ‌లం శ‌రీర నిర్మాణం ఆధారంగానో లేదా దేహ సంబంధ అందంలో భాగంగానో ఈ కిరీటం ద‌క్కింద‌ని భావించ‌డంలో ఓ మోడ‌ల్ కు ఓ విజేత‌కు మ‌నం ఇచ్చిన విలువ ఏ పాటిదీ కాదు.



మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల నుంచి కానీ లేదా సంపన్న కుటుంబాల నుంచి కానీ వ‌చ్చే ఇటువంటి ప్ర‌తిపాద‌న‌లు కానీ లేదా వారు గెలుచుకు వ‌చ్చే అవార్డులు కానీ సామాన్య గృహిణుల‌కు స్ఫూర్తి కావు కానీ కాస్త ఆనందాల‌కు సంకేతం మాత్రం కావొచ్చు. మొద ట్నుంచి ఈమె ఫిట్నెస్ ల‌వ‌ర్ అని చెబుతున్నారు క‌నుక ఆ విధంగా శ‌రీర సౌష్ట‌వాన్ని కాపాడుకోవ‌డంలో అమ్మాయిలు తీసుకునే జాగ్ర‌త్త‌ల‌కు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు ఈమె ఓ రోల్ మోడ‌ల్ అయితే కావొచ్చు. అందంతో పాటు ఆమె చ‌దువు కూడా ఉన్న‌తం గానే ఉంది క‌నుక (ప‌బ్లిక్ యాడ్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ) ఆ విధంగా బాగా చ‌దువుకుని బాగా రాణించేందుకు ఉన్న అవ‌కాశాలు ఈ మోడ‌లింగ్ లో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఆమె ఓ స్ఫూర్తి కావొచ్చు.



ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో

దేశం కొన్ని విష‌యాల్లో ప్రేమ పూర్వ‌క విశ్వాసాన్ని అందిస్తుంది. అందాల పోటీల‌లో తార‌ల‌కు ఆ ప్రేమ గొప్ప విశ్వాసం అందిస్తుం ది. ప్రేమ ఏద‌యినా న‌మ్మ‌కం నుంచో విశ్వాసం నుంచో పుట్టుకు రావాలి.. బ‌క్క చిక్కిన పిల్ల‌కు మిస్ యూనివ‌ర్స్ కిరీటం రావ‌డం లో ఆమె కృషి ఉంది. ఆమె అందంతో పాటు ఇంకొన్ని తెలివితేట‌ల‌కూ ఈ అవార్డు వ‌చ్చింద‌ని నిర్వాహ‌కులు అంటున్నారు.  పంజా బ్ లో ఈ సుంద‌రి ఓ చిన్న మోడ‌ల్.. నిన్న‌టి దాకా మ‌న‌కు పేరు తెలియ‌ని మోడ‌ల్.. మీడియాకు కూడా పేరు తెలియ‌ని మోడ ల్.. త‌న ప్ర‌తిభ‌నో అందాన్నో క‌ల‌పి క‌ల‌గ‌లిపి విశ్వ వేదిక‌ల‌పై రాణించడం అన్న‌ది ఆత్మ విశ్వాస ప్ర‌తీక ఎందుకు  కాదు.. త‌ప్ప‌క అవుతుంది. గెలుపు ఆత్మ విశ్వాస ప్ర‌తీక మాత్ర‌మే కాదు కొంద‌రికి అది ఓ స్ఫూర్తి విధాత..క‌నుక అందం గా ఉన్న అమ్మాయిలు ఉన్నామ‌నుకుంటున్న అమ్మాయిలు మ‌రీ తిండీ తిప్ప‌లు మాని మ‌రీ! ఇలాంటి పోటీల‌కు పోటీ ప‌డ‌డంలో వింతేం లేదు కానీ మీ సామ‌ర్థ్య అంచ‌నాలు మాత్రం త‌ప్ప‌క అందుకుంటూనే విశ్వ వేదిక‌ల‌కు అర్హ‌త ఉందో లేదో ఒక్కసారి మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించు కుంటే మేలు.


ఇంకా చెప్పాలంటే...


భార‌తీయ అందానికి విశ్వ కిరీటం..అని రాయాలి. ఆ ప‌ని గతంలో ఇద్ద‌రు చేశారు, సుస్మితా సేన్ మ‌రియు లారాద‌త్తా చేశారు. ఆ త రువాత అంటే రెండు ద‌శాబ్దాల త‌రువాత ఈమె చేశారు. ఎక్క‌డో ఓ చిన్న‌మోడ‌ల్ కు ఇంత‌టి ఘ‌న కీర్తి ద‌క్క‌డంతో దేశం అంతా ఆ నందిస్తోంది. ఎక్క‌డో ఓ చిన్న న‌టి ఇంత‌టి స్థాయి అందుకోవ‌డంతో చాలా మంది యువ‌తుల సంతోషాల‌కు హ‌ద్దే లేకుండా పో తోంది . వేడుకల వేళ విమెన్ ఎంప‌వ‌ర్మెంట్ గురించి, స్వ‌శ‌క్తి దాయ‌క ప్ర‌య‌త్నాల గురించి కూడా మ‌గువ‌లు మ‌రో సారి ఆలోచించుకుని తామేం సాధించ‌గ‌ల‌మో నిర్దేశించుకుని ఈ పిల్ల‌కు అభినందన‌లు చెబితే ఇంకా మేలు.


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: