తల్లిపాలు బిడ్డకే కాదు తల్లికి కూడా మేలు చేస్తాయి. అవును మీరు విన్నది నిజమే. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగేంతవరకు దశలవారీగా తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. పుట్టిన పిల్లాడికి తల్లిపాలు ఎంతో అవసరం. మొదటి ఆరు నెలలపాటు తల్లిపాలే శిశువుకు ఆహారమని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు దోహదపడుతుంది. అయితే తల్లిపాలు బిడ్డకే కాకుండా తల్లికి ఏ రకంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. దశలవారీగా తల్లి పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రోజు మనం పరిశీలిద్దాం.


పిల్లాడు పుట్టిన తర్వాత.. తల్లి నుంచి వచ్చే పాలను కొలొస్ట్రమ్ అంటారు. ఈ పాలు నవజాత శిశువుకు ఎంతో ముఖ్యమైనది. కొలొస్ట్రమ్‌తో పుట్టిన పిల్లాడికి పోషణ ప్రారంభమవుతుంది. తల్లి, బిడ్డ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. రెగ్యులర్‌గా తల్లిపాలు ఇవ్వడం వల్ల గర్భాశయం పూర్వ స్థితికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, వారి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ మెరుగు పడటానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయి. తల్లి పాల ద్వారా శిశువుకి శిశు మరణ సిండ్రోమ్ లేదా ఎస్ఐడీఎస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా వంటి సమస్య తగ్గిస్తుంది. తల్లులకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య కూడా తగ్గుతుంది.


అలాగే శిశువు జీర్ణవ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. ఘనమైన ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు జీర్ణవ్యవస్థ సిద్ధంగా ఉంటుంది. అలాగే తల్లి పాలు పట్టడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అయితే పిల్లలకు ఆరేళ్లు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆహారం తినలేకపోవచ్చు. అలాంటప్పుడు తల్లిపాలు ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతుచిక్కని అనారోగ్య సమస్యల నుంచి బిడ్డకు రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏడాదిపాటు పిల్లాడికి పాలు పట్టడం ద్వారా.. శిశువుకి ప్రాణాంతకమైన గుండె జబ్బులు, రక్తపోటు, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే పిల్లలకు తల్లులూ పాలు పట్టిస్తుండాలి. అప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: