టాటా నుండి కొత్త మోడల్ కార్ రిలీజ్ చేశారు కంపెనీ వారు. అయితే ఆ కార్ పేరు మీద లాటిన్ అమెరికాలో ఓ వైరస్ వస్తుండటంతో దాని పేరు మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. టాటా నుండి సరికొత్త జికా మార్కెట్ లోకి రిలీజ్ అవ్వబోతుంది. అయితే జికా అన్న వైరస్ లాటిన్ అమెరికాను గడగడ లాడిస్తుంది.
అందుకే ఇప్పుడు ఆ పేరుని మార్చే పనిలో ఉన్నారు కంపెనీ వారు. కొత్త పేరుని టైగో మారుస్తున్నారు. ప్రస్తుతం టాటా ప్రొడక్ట్స్ నానో, బోల్ట్ మధ్యలో ఈ టైగో మార్కెట్ లోకి వస్తుంది. కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ముఖ్య ఉద్దేశంతో మరింత మెరుగైనా టెక్నాలజీతో ఈ కార్ రిలీజ్ చేస్తున్నారు. ఇండికా మోడల్ ను మార్చి ఈ టైగోను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
థ్రీ సిలిండర్ ఇంజిన్స్ తో పెట్రోల్, డీజిల్స్ తో ఈ కార్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. టాటా రేంజ్ క్వాలిటీ ఎక్విప్మెంట్ తో ఈ కార్ రిలీజ్ అవుతుంది. మారుతి అండ్ టాటా కంపెనీ ఆథ్రైజ్డ్ డీలర్స్ అందరి దగ్గర ఈ కొత్త టాటా టైగో అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఇది ఎన్నో ఫెలిసిటీతో తయారు చేయబడ్డది. ఇక దీని వెల 3.90 లక్షల నుండి 5 లక్షల వరకు వస్తుంది. బడ్జెట్ కార్ లా అందుబాటులో ఉన్న ఈ కార్ ఎన్నో ముఖ్య ప్రయోజనాలతో రిలీజ్ అయ్యింది.