ఆటో ఎక్స్ పో 2016లో జాగ్వార్ కంపెనీ మూడు సరికొత్త మోడల్స్ ను ప్రదర్శనలో ఉంచింది. అయితే వాటిని ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట్లో ఆటో ఎక్స్ పోలో గుర్తించ బడ్డ ఎక్స్ ఈ, ఎక్స్ ఎఫ్ కార్లు రానున్న రోజుల్లో రిలీజ్ అవనున్నాయి.


జాగ్వార్ ప్రతిష్టను మరింత పెంచేలా అత్యంత విశిష్టగల సౌకర్యాలతో ఎక్స్.ఎఫ్ కార్ రాబోతుంది. మొత్తం ఎల్.ఈ.డి సిస్టెమాటిక్ లైట్స్ తో అమర్చబడిన ఈ జాగ్వార్ కార్ ఎక్స్ ఎఫ్ పెట్రోల్ డీజిల్ ఎంజిన్స్ తో అందుబాటులోకి వస్తుంది. ఇక దీని ఇంజిన్ విషయానికొస్తే 2.0 లీటర్ ఇగ్నియం డీజిల్ ఇంజిన్ తో 180 పి.ఎస్ మరియు 400 ఎ.ఎం తో కలిగి 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులోకి వస్తుంది.  మరి ప్రపంచంలో అత్యంత లక్సరియస్ కార్ గా క్రేజ్ ఉన్న ఈ జాగ్వార్ నుండి వస్తున్న ఈ సరికొత్త ఎక్స్.ఎఫ్ మరింత కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేయాలని, చేస్తుందని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: