అనుపమ పరమేశ్వరన్ ఇటీవల టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.అందువల్ల ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బాగా బిజీగా ఉంది. తన మాలీవుడ్ లో రెండేళ్ల తర్వాత 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చేస్తోంది. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంకా అలాగే ఈ మూవీతో పాటు అనుపమ 'సినిమా బండి' డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులతో ఓ సినిమా చేస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా టైటిల్ ను నేడు అనౌన్స్ చేశారు మేకర్స్. లేడీ ఓరియెంటెడ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పరదా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.  ఎప్పటి నుంచో ఇదే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో మరో మలయాళం హీరోయిన్ దర్శనా రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ అనుపమ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
పరదా లేకుండా అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ట్రెడిషనల్ దుస్తుల్లో అనుపమ.. ఓణీతో ముఖాన్ని కప్పుకుని ఉన్న మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి ఆమె పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ మూవీలో అనుపమ డీ గ్లామరస్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుందని సమాచారం తెలుస్తుంది. దీంతో నెటిజన్స్ రెండు సినిమాలు హిట్ అవ్వగానే పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అయిపోయింది అనుపమ. ఏదైతే ఏం మూవీ బాగుంటే చాలు బ్రేక్ ఇచ్చేందుకు మేము సిద్ధం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు, కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆనంద మీడియా బ్యానర్‌ పై శ్రీనివాసులు, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఏ విధంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: