ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో మూడు రాజధానుల గురించి బహిరంగ సభలలో ప్రస్తావించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో జగన్ వెనక్కు తగ్గారని సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే వాస్తవాలు ఏంటంటే ఈ హామీల విషయంలో జగన్ మాట తప్పలేదని మడమ తిప్పలేదని తాజా కామెంట్లతో తేలిపోయింది.
 
మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ మరోమారు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలన సాగిస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖను శరవేగంగా అభివృద్ధి చేస్తానని జగన్ వెల్లడించారు. విశాఖ వాసులకు మేలు జరిగేలా జగన్ హామీలను కురిపించి ఆ ప్రాంత వాసులకు ఎంతో బెనిఫిట్ కలిగేలా చేశారని చెప్పాలి.
 
మూడు రాజధానులకు సంబంధించి జగన్ నుంచి మరోసారి స్పష్టత రావడంతో ఉత్తరాంధ్ర వాసుల ఓట్లు వైసీపీకే పడే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమరావతి శాసనసభా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా కొనసాగుతాయని  జగన్ వెల్లడించారు. రాజధానుల విషయంలో ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్న జగన్ మేనిఫెస్టోలో సైతం ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే ప్రకటించారు.
 
చంద్రబాబులా మోసపూరిత హామీలు ఇవ్వనని చెప్పిన జగన్ మరోసారి పేద ప్రజల మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేశారు. పేదల గుండెల్లో జగన్ చోటు సంపాదించుకున్నారని ఈ ఎన్నికల్లో సైతం జగన్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సభలలో హుందాగా మాట్లాడుతూ జగన్ పరిణతి చెందిన నాయకుడు అని అనిపించుకుంటున్నారు. చేసింది చెప్పుకుని ఓట్లు అడుగుతున్న జగన్ ఈసారి ఎన్ని స్థానాల్లో పార్టీని గెలిపిస్తారో చూడాల్సి ఉంది. మేనిఫెస్టోను ప్రకటించిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారంలో మరింత వేగం పెంచనున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: