అసలు వేసవి కాలంలో ఏది పడితే అది తినకూడదని ఆరోగ్య చెబుతున్నారు. ముఖ్యంగా వేడి పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ వేసవిలో శరీరంలో నీటిశాతం ఉండేలా, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారపదార్థాల పట్ల ఎక్కువ దృష్టి పెట్టాలి.  వేసవిలో ప్రతిరోజూ కొన్ని రకాల గస గసాలు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.వేసవిలో గసగసాలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


వేసవి కాలంలో గసగసాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వీటిని తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు అదుపులో ఉంటుంది. గసగసాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వెన్నునొప్పి లేదా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి గసగసాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా గసగసాలు మేలు చేస్తాయి. రోజూ ఉదయాన్నే గసగసాల పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారి ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. 


మీరు గసగసాల గింజలను అనేక విధాలుగా తినవచ్చు. పాలలో లేదా నీటిలో నానబెట్టిన లస్సీ లేదా షర్బత్ రూపంలో కూడా తీసుకొచ్చు.వీటిని రోటీ లేదా పరాటాలో గసగసాలు వేసుకుని తినవచ్చు. ఇది కాకుండా సలాడ్‌లో గసగసాలు వేసి రోజూ తినొచ్చు. కాకపోతే, గసగసాలు పరిమిత పరిమాణంలో తినడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం హానికరం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు గసగసాలు తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.గసగసాలు ఆహారానికి రుచిని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇది ఎముకలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. గసగసాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి చాలా వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.గసగసాలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఇందులో ఐరన్, కాపర్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఉంటాయి. గసగసాలు తింటే పొట్ట చల్లబడుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: