ఎన్నికల వేళ ఏపీలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పరిస్థితి నడుస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో కులాలు అనేవి అభ్యర్థి గెలుపులో కీలకంగా మారుతుంటే మరికొన్ని నియోజక వర్గాల్లో వారిన చేరిన పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే సొంత పార్టీ నేతలే అభ్యర్థిని ఓడిస్తుండటం కొసమెరుపు. అయితే ఈ పరిణామాలు కొత్తగా వచ్చినవి కాదు. ఏనాటినుండో వస్తున్న సాంప్రదాయ రాజకీయాలు ఇవి. కాగా ప్రస్తుతం డోన్ నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న సూత్రంతో కర్నూలు జిల్లాలో పట్టున్న కేఈ, కోట్ల కుటుంబాలకు ఒక్క టిక్కెట్ మాత్రమే చంద్రబాబు కేటాయించడం జరిగింది. ఇప్పుడు అదే ఇబ్బందికి కారణమయింది.

అవును, విషయం ఏమిటంటే... కోట్ల, కేఈ కుటుంబాలు అక్కడ కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులు. రాజకీయ వైరంతో పాటు వ్యక్తి గత కక్షలు కూడా ఆ కుటుంబాల మధ్య ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కోట్ల, కేఈ కుటుంబాలను ఒకటి చేసిన సంగతి విదితమే. ఒకే వేదికపై చేతులు చేతులు కలిపి తాను గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు కూడా. కానీ వారిద్దరూ చంద్రబాబు కోసం అయితే కలిశారు కానీ.. క్షేత్ర స్థాయిలో మాత్రం వారి కదలికలు.. కలిసినట్లు కనపడటం లేదన్నది నగ్న సత్యం. కోట్ల కుటుంబంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి డోన్ నియోజవకర్గం టిక్కెట్ ఇవ్వగా, కేఈ కుటుంబంలో పత్తికొండ నియోజకవర్గం టిక్కెట్ ను శ్యాంబాబుకు చంద్రబాబు ఇచ్చారు.

కాగా ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి ఆయన సోదరులే ఆయన వెంట నడవడటంలేదు. ఈ క్రమంలో ఇక్కడ వారికి కేఈ వర్గం ఏ మేరకు మద్దతిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. గత రెండు ఎన్నికల్లో కోట్ల కుటుంబం కేఈ కుటుంబానికి మద్దతు తెలపలేదన్న కోపం వారిలో స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు కోట్ల కుటుంబం వంతు వచ్చింది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన తొందరగా జనంలో కలసిపోడన్న పేరున్నా.. ఆయన చాలా రోజుల తర్వాత శాసనసభకు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన గెలిస్తే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని కేఈ వర్గం సపోర్టుచేయదనే వారు కూడా ఉన్నారు. మరి ఈ విషయం ఎటునుండి ఎటు వెళ్తుందో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: