వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారనే వార్త ఇప్పుడు పార్టీలో చర్చనీ అంశంగా మారుతున్నది.. గెరవాల్సిన సమయంతో విడుదల చేసిన మేనిఫెస్టో వల్ల పట్టు సదులుతోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకట్టుకునే అంశాలు కూడా లేకపోవడంతో కొంత వైసీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదు. కొత్త పథకాలను కూడా అందులో ప్రవేశపెట్టడం కూడా లేదు. కూటమిలో భాగంగా పథకాలను కూడా పెద్దగా ప్రవేశపెట్టడం లేదు. కేవలం పాత పథకాలకే నగదు పెంచుకుంటూ పోవడం పైన చాలా మంది నేతలు పెదవి విరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మరొకవైపు పింఛన్ మొత్తాన్ని కూడా చంద్రబాబు ₹4,000 చేస్తానని చెప్పగా జగన్ కేవలం 3500 చేస్తానని అది కూడా లాస్ట్ రెండు సంవత్సరాలకి చేయగలనని కూడా చెప్పారు.



ఏపీ సీఎం జగన్ అతి విశ్వాసంతో వెళ్లడం ఈ ఎన్నికలలో చాలా ఇబ్బందికరమే అంటూ పలువురు పార్టీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీ ప్రస్తావన లేకుండా పెద్ద తప్పు చేశారని విధంగా వైసిపి నేతలు తెలియజేస్తున్నారు. ఇప్పుడున్న లబ్ధిదారులు కూడా ఎవరు ఎక్కువ నగదు ఇస్తామంటే వారికి ఓటు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. రుణమాఫీ విషయంపై ఏదో ఉంటుందనుకున్నా ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని చెప్పవచ్చు.

తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం రెండు పేజీలతో విడుదల చేసిన ఈ మ్యానిఫెస్టో ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూ కొంతమేరకు నగదును మాత్రమే జోడి చేసి మేనిఫెస్టోను   విడుదల చేశారు. రైతు భరోసాను 13500 నుంచి 16,500 వరకు పెంచారు. 3000 రూపాయల పెంచడంతోనే సర్దిపెట్టారు. అటువైపు టీడీపీ పార్టీ రైతు భరోసాను 20 వేల రూపాయల వరకు పెంచుతున్నారు. చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో సీఎం జగన్ ఇలాంటి మేనిఫెస్టో విడుదల చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని పలువురు నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: