ఏపీ సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను తమ పార్టీనే తీసుకొచ్చిందని తమ పార్టీ వల్లే డోర్ టు డోర్ పథకాల అమలు జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కూటమి వాలంటీర్లకు 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో జగన్ సైతం అదే తరహా హామీని ప్రకటిస్తారని చాలామంది వాలంటీర్లు ఫీలయ్యారు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి 60,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
 
వైసీపీ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని వాలంటీర్లు భావించడం జరిగింది. అయితే వైసీపీ గెలిచినా జీతాల పెంపు లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాలంటీర్లకు 5750 రూపాయల వేతనం లభిస్తోంది. జగన్ వాలంటీర్ల వేతనాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్రంలోని వాలంటీర్లంతా తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యారు.
 
వైసీపీని నమ్ముకుని ఎన్నేళ్లు కష్టపడినా తమ జీవితంలో పెద్దగా మార్పు వచ్చే అవకాశాలు అయితే ఉండబోవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకునే విషయంలో వైసీపీ పూర్తిస్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తగా ఏముందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ ఎన్ని చెప్పినా ఓటర్ల లెక్కలు ఓటర్లకు ఉంటాయనే సంగతి తెలిసిందే.
 
అమలు సాధ్యమయ్యే హామీలను ప్రకటిస్తానని జగన్ చెప్పినా ప్రజలకు సైతం వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ను  ఎవరో తప్పుదారిలో నడిపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వైసీపీ స్థాయిలో మరే పార్టీ మేనిఫెస్టో నిరాశపరచలేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మేనిఫెస్టో వల్ల వైసీపీకి తీరని నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో కూటమి గెలిచే విధంగా జగన్ మేనిఫెస్టో సిద్ధం చేశారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జగన్ రుణమాఫీ ఎక్కడ ప్రకటిస్తారో అని భావించిన కూటమి నేతలకు టెన్షన్ తగ్గిందనే చెప్పాలి. వైసీపీ మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: