ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేశారు.. 2019లో ఇచ్చిన హామీలను నిష్టగా అమలు చేశామని తెలిపిన ఈయన చెప్పినవన్నీ అమలు చేసి ప్రజల్లో హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. 2014లో చంద్రబాబు ప్రవేశపెట్టిన మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించిన ఆయన తాను చంద్రబాబు లాగా చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండలేదని.. తాను చెప్పిన హామీలన్నీ కూడా నూటికి 98% నెరవేర్చాలని తెలిపారు. ఇక మరోసారి తన మేనిఫెస్టోలో అవే పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ.. అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.. ఈ నేపథ్యంలోనే కీలక హామీలు కూడా ప్రకటించారు..


నవరత్నాలలో భాగంగా అన్ని పథకాలను అలాగే కొనసాగిస్తూ కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైతులకు శుభవార్త తెలుపుతూ ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయని చెప్పవచ్చు.  చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన తర్వాత ప్రజలందరూ జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కోసం ఎదురు చూశారు.. ముఖ్యంగా రైతులు రుణమాఫీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు.. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రుణమాఫీ ఊసే ఎత్తకుండా రైతు భరోసా పెంపొందిస్తూ చేసిన ప్రకటన రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

తాజాగా రైతులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము రూ.13,500 నుండీ రూ.16000 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఈసారి ఈ మొత్తాన్ని రూ.16 వేలకు పెంచి 5 ఏళ్ల కాలంలో మొత్తం రూ .80, 000 ఇస్తామని ప్రకటించారు .ఇక రైతులకు ప్రస్తుతం అందిస్తున్న అన్ని రకాల లబ్ధి కొనసాగుతుందని జగన్ వెల్లడించారు..  మొత్తానికైతే రుణమాఫీ కంటే ఇప్పుడు రైతు భరోసా ద్వారానే ఐదు సంవత్సరాల కాలంలో 80 వేల రూపాయలను ఉచితంగా రైతులు పొందబోతున్నారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం మేనిఫెస్టో విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రజలలో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: