- అమ్మ ఒడి రు. 15 వేల నుంచి రు. 17 వేలు
- కాపు నేస్తం రు. 60 వేలు రు 1.20 ల‌క్ష‌ల‌కు పెంపు
- ఆసరా, కళ్యాణమస్తు, షాదీ తోఫాల పెంపు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

హామీ ఇచ్చాడు... అమలు చేస్తాడు... ఇదే ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న మాట. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రతి పథకానికి ఓ స్పష్టమైన తేదీ ప్రకటించింది. ఏవైనా సాంకేతిక కారణాలు వస్తే తప్ప... చెప్పిన తేదీకి ఠంఛన్‌గా బటన్‌ నొక్కారు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి. పైగా గతంలో మాదిరిగా పథకాల అమలులో మధ్యవర్తుల పాత్ర లేకుండా చేశారు. నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే నిధులు జమ చేశారు వైఎస్‌ జగన్‌. దీంతో టీడీపీ అభిమానులు సైతం.... పథకాల అమలులో పారదర్శకత ఉందంటున్నారు.


విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నవరత్నాల ప్లస్‌ పేరుతో మేనిఫెస్టో రూపొందించారు జగన్. ఇప్పటికే ఐదేళ్లుగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం... దానికి మరికొంత అదనంగా అందించనున్నారు. ఇప్పటి వరకు రూ.15 వేలు అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో వేస్తున్నారు. ఇందులో రూ.2 వేలను పాఠశాల మెయింటెనెన్స్‌ కింద కేటాయిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి దీనికి మరో రూ.2 వేలు అదనంగా కేటాయించారు. ఇకపై అమ్మఒడి కింద రూ.17 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెరిచిన పుస్తకమని.. అది ప్రతి ఒక్కరికీ తెలుసన్న జగన్‌... అమలుకు వీలున్న హామీలు మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించారు.


వైఎస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు ప్రస్తుతం ఇస్తున్న వాటికంటే అదనంగా ఇస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇకపై రూ.లక్షన్నర ఇస్తామన్నారు. చేయూత, కాపు నేస్తం ఇకపై రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. కాపు నేస్తం రూ.60 వేలకు బదులుగా రూ.1.20 లక్షల వరకు, చేయూతను రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఇస్తామన్నారు. ఇక పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్లు పథకం కింద... వచ్చే ఐదేళ్లల్లో మర 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు జగన్. వీటితో పాటు వాహన మిత్ర పథకం కింద ఇప్పటి వరకు ఐదేళ్లలో రూ.50 వేలు చెల్లించామని... రాబోయే ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి రూ.లక్ష అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.


మేనిఫెస్టోలో చెప్పకపోయినా సరే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా యూనిఫామ్, బ్యాగు, షూస్‌ మొదలగునవి ఇచ్చామన్న జగన్‌.. నాడు నేడు కింద డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ను ప్రొత్సహించామన్నారు. దీంతో జగన్‌ హామీ ఇచ్చాడు... కాబట్టి తప్పకుండా అమలు చేస్తాడు అనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: