కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో అన్ని రంగాలు వాటి ప్రగతిని కోల్పోయాయి. ఇక అదే ఆటోమొబైల్ రంగం విషయం లోకి వస్తే ఈ రంగం పూర్తిగా దెబ్బతింది అని చెప్పవచ్చు. ఒకవైపు ఫ్యాక్టరీలు తెరిచి పని చేసుకోలేక, మరో వైపు ఉన్న స్టాక్ ని అమ్ముకోలేక ఆటో రంగం కుదేలైంది అని చెప్పవచ్చు. ఇంకా ఈ నష్టాల నుంచి బయటపడేందుకు వివిధ కంపెనీలు కార్లకు తగ్గట్టు భారీ రాయితీలను ప్రకటిస్తున్నాయి. 

IHG


ప్రస్తుతం ఇదే కారణంగా ఈ లిస్టులో హోండా సంస్థ చేరిపోయింది. హోండా సంస్థ జూన్ నెలకు డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని కార్లకు అదనంగా క్యాష్ డిస్కౌంట్లు, యాక్సిడెంట్ వారంటీలు, ఎక్స్చేంజ్ ఆఫర్లు మొదలగు ఇతర కొన్ని ప్యాకేజీలు bs6 వాహనాలపై ఇవ్వబోతోంది. ఇకపోతే హోండా అమేజ్, హోండా సిటీ లాంటి కార్లపై ఏకంగా లక్ష రూపాయల వరకు రాయితీని సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా హోండా సిటీ పెట్రోల్ ఇంజన్ పై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో ఉన్న మూడు మోడల్స్ పై కూడా క్యాష్ డిస్కౌంట్ ను ప్రకటించింది సంస్థ.

IHG


అందులో భాగంగా 25 వేల రూపాయల వరకు రాయితీని ఇవ్వడమే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ 25 వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీనితో హోండా సిటీ పై ఏకంగా 72 వేల రూపాయల భారీ డిస్కౌంట్ల లభించబోతుంది. ఇక దాంతోపాటు 37 వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్, 35 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్స్ ను మరికొన్ని కార్లపై భారీ ఆఫర్స్ ను ప్రకటించింది హోండా సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: