భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా వీటిని నగరాలలో ఎక్కువగా వాడుతున్నారు. దీనికి కారణం రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకరకంగా కారణమైతే, మరోవైపు వీటి రిపేర్ ఖర్చులు చాలా తక్కువ అని చెప్పవచ్చు. దీనికోసం స్కూటర్ల కంపెనీలు భారతదేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంపియర్ సంస్థ తన సరికొత్త విద్యుత్ స్కూటర్ మాగ్నస్ ప్రో ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలు ఇందులో పొందుపరిచారు. ఇకపోతే ఎక్స్ షోరూంలో ఈ టూ - వీలర్ ధర రూ. 73,990లుగా సంస్థ నిర్దేశించింది.

IHG

 

ఇకపోతే ప్రస్తుతం ఈ స్కూటర్ ని కేవలం బెంగళూరు నగరానికి మాత్రమే పరిచయం చేసింది కంపెనీ. అక్కడి మార్కెట్ సేల్స్ బట్టి రాబోయే రెండు మూడు నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం ఈ స్కూటర్ ను విడుదల చేయబోతోంది కంపెనీ. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్ లో బుకింగ్ కూడా మొదలు పెట్టేసింది. అతి త్వరలో వీటి డెలివరీ లను కూడా ఇవ్వబోతోంది సదరు సంస్థ. ఇక ఈ స్కూటర్ ఇంజన్ విషయానికొస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 60 వోల్టుల, 30 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ తో పాటు 1. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రికల్ మోటార్ ను ఇందులో ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యాటరీ కి ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. స్కూటర్ బైక్ గంటకు కనీసం 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇందులోని బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ కావాలి అంటే సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: