ఇప్పుడు సైన్స్ ఎంతగా పరిగెడుతుందంటే అంతకు వంద రేట్లు ఎక్కువగా యువత మైండ్ కూడా దూసుకెళ్తుంది.. అయితే ఇప్పుడు యూత్ బుక్స్ మీద పెట్టాల్సిన శ్రద్ధను బైక్ ల మీద పెడుతున్నారు.ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన బైక్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి..తాజాగా మరో యమహా కంపెనీ కొత్త బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యమహా వింటేజి ఎడిషన్ FZS-Fi. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 1.09 లక్షలుగా సంస్థగా నిర్దేశించింది. స్టాండర్డ్ వేరియంట్ కంటే 5 వేల రూపాయల ధర ఎక్కువగా ఉంది..కొత్త లుక్స్, సరి కొత్త ఫీచర్స్ , అప్డేట్ టెక్నాలజీ తో చూపరుల మనసును దోచుకుంటుంది..



149 సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 7250 ఆర్పీఎం వద్ద 12.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద13.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.ఇకపోతే ఈ బైక్ 13 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది..దీంతో పాటుగా 137 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది..అంతేకాదు ప్రస్తుతం  యువత కోరుకొనే కలర్స్ లో ఈ బైక్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.. స్టయిల్ లుక్ తో పాటుగా అన్నీ కూడా కుర్ర కారు మతిని పోగొడుతున్నాయి.. 



ఫ్రంట్ వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ మోనోషాక్ సెటప్ ఉంది. ఇవి కాకుండా ఈ సరికొత్త బైక్ 282 ఎంఎం, 220ఎంఎం ముందు, వెనక డిస్క్ బ్రేకులు కలిగి ఉండటం ఈ యమహా ప్రత్యేకత.. కుర్రాళ్ళ కళ్ళను జిగేల్ మనిపిస్తుంది..అంతేకాకుండా దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. యమహా ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ మోటార్ సైకిల్ కు పోటీగా భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, సుజుకీ జిక్సెర్ 155 లాంటి బండ్లు ఈ యమహాకు పోటీగా ఉన్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ బైక్ ప్రత్యేకతలు మొత్తానికి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: