దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రోజు రోజుకు పెరుగుతన్న డిమాండ్ కు తగినట్లుగానే తయారీదారులు కూడా వివిధ విభాగాలలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఇక అంతేకాకుండా, ఈ సెగ్మెంట్లో మునుపెన్నడూ వినని బ్రాండ్లు ఇంకా కొత్త తయారీదారులు కూడా పుట్టుకొస్తున్నారు. తాజాగా, బెంగుళూరుకు చెందిన కంపెనీ నిసికి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Nisiki Technologies Pvt Ltd) యొక్క అనుబంధ కంపెనీ అయిన పోయెస్ స్కూటర్స్ (Poise Scooters), ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

పోయెస్ స్కూటర్ల ధరలు విషయానికి వస్తే..

పోయెస్ స్కూటర్స్ విడుదల చేసిన స్కూటర్లలో పోయెస్ ఎన్ఎక్స్-120 (Poise NX-120) ఇంకా అలాగే పోయెస్ గ్రేస్ (Poise Grace) మోడళ్లు ఉన్నాయి. అలాగే వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

1.Poise NX-120 - Rs. 1,24,000

2.Poise Grace - Rs. 1,04,000

(రెండు ధరలు కూడా ఎక్స్-షోరూమ్, కర్ణాటకకు చెందినవి)

ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అమ్మనుంది. అలాగే వాటి ధరలు కూడా ఆయా రాష్ట్రాలలో అందించే సబ్సిడీలను బట్టి వేరుగా ఉంటాయి.

ఇక Poise NX-120 ఇ-స్కూటర్ డిజైన్‌ను కనుక గమనిస్తే, ఇది షార్ప్ బాడీ లైన్స్‌తో ఇంకా అలాగే యాంగిల్స్‌తో చాలా స్పోర్టీ అండ్ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్కూటర్ యవతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన ఇ-స్కూటర్‌లాగా అనిపిస్తుంది. అయితే, ఇక Poise Grace ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం, దాని పేరు సూచించినట్లుగానే,మంచి కాంపాక్ట్ డిజైన్‌తో క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది.

పోయెస్ ఎన్ఎక్స్-120 ఇంకా అలాగే పోయెస్ గ్రేస్ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు వేరు చేయగల బ్యాటరీలను కలిగి ఉంటాయి. ఇక వీటిని సాధారణ హోమ్ అవుట్‌లెట్‌లను ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ హోమ్ ఎలక్ట్రిక్ యాక్ససరీస్ లాగానే తగిన 220 వోల్ట్ పవర్ సాకెట్‌ సపోర్ట్ తో అపార్ట్‌మెంట్‌లలో కూడా చాలా సులువుగా ఛార్జ్ చేయగల సులభ పోర్టబుల్ బ్యాటరీతో కంపెనీ వీటిని రూపొందించింది. బేస్‌మెంట్‌లో చార్జింగ్ సౌకర్యం లేని ఇంకా అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి ఈ ఫీచర్ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: