ఈ చలికాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ముఖ్యంగా అనేక రకాల జుట్టు సమస్యలు వస్తుంటాయి. ఇంక కర్లీ హెయిర్ వున్న వారికి జుట్టు కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది.ఈ చలి కాలంలో కర్లీజుట్టుకు తేమను కోల్పోవడం , నిర్జీవమైపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.దీనికి కారణం ఈ వింటర్ సీజన్లో వీచే చల్లగాలులు, మంచు వల్ల జుట్టు తేమను కోల్పోయి, నిర్జీవంగా మారుతుంది. అలాంటివారు బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ కానీ స్కార్ఫ్ కానీ ధరించడం మంచిది. అలాగే ఈ సీజన్లో కర్లీహెయిర్‌ను కాపాడుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఈ సీజన్లో నీరు ఎక్కువగా తాగాలనిపించదు. కానీ రింగుల జుట్టు ఆరోగ్యం కాపాడుకోవాలంటే  తగినంత నీరు తాగడం చాలా అవసరం. నీరు తగినంత తీసుకోవడం వల్ల జుట్టుకే కాదు,శరీరం కూడా తాజాగా ఉంటుంది.

మంచినిద్ర..
నిద్ర కూడా శరీర ఆరోగ్యానికే కాక జుట్టు ఆరోగ్యానికి దోహదపడుతుంది.ప్రతి ఒక్కరూ కనీసం ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి.దానివల్ల జుట్టు ఊడిపోవడానికి కారణమైన ఒత్తిడి తగ్గిపోతుంది.

హెయర్ సిరమ్..
కర్లీహెయర్ ఉన్నవారు తలస్నానం చేసిన తరవాత కొన్ని చుక్కల హెయిర్ సీరంను రాసుకోవడం వల్ల జుట్టును సంరక్షించుకోవచ్చు.
కర్లీ హెయర్ వున్నవారిని ఎక్కువగా బాధించేది జుట్టు చివర్లు చిట్లడం.దానివల్ల వెంట్రుకలు నిర్జీవంగా కనిపిస్తుంది. అలా చిట్లిన హెయర్ ని కట్ చేస్తుండాలి.జుట్టు కట్ చేయడం వల్ల జుట్టుకూడా పెరుగుతుంది.

కలబంద..
జుట్టు ఆరోగ్యానికి కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం 4 స్ఫూన్ ల కలబంద గుజ్జును తీసుకొని అందులో రెండు స్ఫూన్ లా కొబ్బరి నూనె ,రెండు స్ఫూన్ లా తేనే కలిపి,జుట్టుకుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి  ఒకగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల, కర్లీజుట్టుకు తగిన తేమ అంది,ఆరోగ్యాంగా తయారవుతుంది. ఇందులో ఉండే తేనే జుట్టును కండిషనింగ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: