మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు.. గౌట్, కిడ్నీలో రాళ్లు, కీళ్ల నొప్పులతో సహా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఈ సమస్య నుంచి బయట పడటానికి తరచుగా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి కొన్ని నేచురల్ రెమిడిస్ ఫాలో అయితే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్ని రకాల ఆకులు  యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టేందుకు చాలా సహాయపడతాయి. ఈ ఆకులను తినడం వల్ల అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను ఈజీగా నియంత్రించవచ్చు.త్రిఫల అనేది బిభితకీ, అమలకీ, హరితకీ పండ్ల కలయిక. పైగా ఇది అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది గౌట్‌తో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.కొత్తిమీరను సాధారణంగా ఆయుర్వేదంలో పలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మంటను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను కొత్తిమేర కలిగి ఉంటుంది. శరీరం నుండి యూరిక్ యాసిడ్‌తో సహా టాక్సిన్స్‌ను కొత్తిమీర బయటకు పంపుతుంది.తిప్పతీగ ఆయుర్వేదంలో ఒక ప్రసిద్ధ మూలిక. ఇది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను సమతుల్యం సహాయపడుతుంది.


అధిక యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందడంలో తిప్పతీగ సహాయపడుతుంది.వేప ఆకులు శక్తివంతమైన డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. రక్త శుద్దీకరణకు ఉపయోగపడతాయి. అదనపు యూరిక్ యాసిడ్‌ సహా ఇతర వ్యర్థాలను శరీరం నుంచి తొలగించడంలో ఇవి సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలతో సంబంధం ఉన్న లక్షణాలను ఉపశమనం చేస్తుంది.ఇంకా అలాగే తులసి అనేది ఔషధ గుణాలకు ప్రసిద్ధి. దీన్ని భారతదేశంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరాన్ని ఫ్యూరిఫై చేస్తుంది. తద్వారా యూరిక్ యాసిడ్ చేరడాన్ని నిరోధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: