ఐపీఎల్ 2025 స్ట్రీమింగ్ రైట్స్ 23 758 కోట్లకు వయాకామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకున్నది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులు వయాకామ్ తప్ప మరో సంస్థకు లేవు. కానీ ఈ నిబంధనలను అతిక్రమిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లిందని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు వయాకామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధులు ఫిర్యాదుచేశారు.ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో తమన్నా నటించింది. ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తోంది.అందువల్లే తమన్నాకు కూడా మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులను పంపించినట్లు సమాచారం. నెక్స్ట్ వీక్‌లో తమన్నాను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 29న ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.ఈ క్రమంలోనే ఫెయిర్ ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలని ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులకు అధికారులు సమన్లు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. 2023 డిసెంబర్‌లో ఈ కేసుకు సంబంధించి ఫెయిర్ ప్లే యాప్‌లోని ఒక ఉద్యోగిని అరెస్టు చేయడంతో దర్యాప్తు గణనీయమైన మలుపు తిరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి