తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రమైనా సరే... కృష్ణా నదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని సూచించింది. ఇదే విషయాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి షెకావత్ వెల్లడించారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు షెకావత్ సమాధానమిచ్చారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులపై కేంద్రం తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై కూడా షెకావత్ వివరణ ఇచ్చారు. కృష్ణా నదిపై అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపాల్సిందే అని తేల్చేశారు. అదే సమయంలో ఇప్పటికే మొదలు పెట్టిన ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకోలేకపోతే... వాటి నిర్వహణ కూడా ఆపాలన్నారు. తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపినట్లు కేంద్ర మంత్రి షెకావత్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: