టోక్యో ఒలింపిక్స్ ( olympics ) జావెలిన్ త్రో ఈవెంట్లో ఎన్నడూ మరిచిపోలేని అద్భుత ప్రదర్శన కనబర్చి బంగారు పతకం గెలిచిన నీరజ్ చోప్రాపై మన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ రోజు టోక్యోలో సరికొత్త చరిత్ర రాయబడిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.ఇక ఈరోజు నీరజ్ చోప్రా సాధించిన ఘనత దేశ ప్రజల మనసుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిందని మోడీ కొనియాడారు. ఫైనల్‌లో నీరజ్ ప్రదర్శన ఆమోఘని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకోవడం జరిగింది.ఇక ఈరోజు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతోపాటు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించాడని మోడీ పొగిడారు. ఇక టోక్యోలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన నీరజ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నానని ప్రధాన మంత్రి మోడీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా నీరజ్ చోప్రాని మెచ్చుకొని అతనికి  అభినందనలు తెలియజేశారు.

https://twitter.com/narendramodi/status/1423982290296721411?s=19



 https://twitter.com/rashtrapatibhvn/status/1423980109753577482?s=19


మరింత సమాచారం తెలుసుకోండి: