దేశంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆర్థిక రాజ‌దాని ముంబ‌యిలో  పెట్రోల్ లీటరు ధర 108.67 రూపాయలకు చేర‌గా, ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్ లీటరుకు 30 పైసలు పెరిగింది. లీటరు పెట్రోల్ ధర రూ.102.64, డీజిల్ లీటరు ధర రూ.91.07కు పెరిగాయ‌ని ఐవోసీ తెలిపింది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారే సంగ‌తి తెలిసిందే. దేశంలోనే అత్యధికంగా ఒక్క ముంబ‌యిలోనే చ‌మురు ధ‌ర‌లు ఎక్కువగా ఉన్నాయి. ముంబ‌యిలో పెట్రోల్ లీటరు ధర రూ.108.67, డీజిల్ లీటరు ధర రూ.98.80 కి పెరిగాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం,హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రతిరోజూ ఇంధన ధ‌ర‌ల‌ను సవరిస్తున్నారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.23, లీటర్ డీజిల్ ధర రూ. 95.59గా ఉండ‌గా, కోల్‌కతాలో పెట్రోల్ లీట‌రుకు రూ. 103.36, డీజిల్ రూ. 94.17కు పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు మంగళవారం మళ్లీ పెరగడంతో ప్రజలపై అదనపు భారం ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: