క‌రోనా టీకా మొద‌టి డోసు తీసుకున్న‌వారు చాలామంది ఆ త‌ర్వాత రెండో డోసు తీసుకోవ‌డంలేద‌ని వైద్య‌నిపుణులు చెబుతుండ‌టంతోపాటు ప్ర‌భుత్వ లెక్క‌లు కూడా అలాగే ఉన్నాయి. ఉదాసీన వైఖ‌రితోపాటు చాలామంది మాస్క్‌లు కూడా ధ‌రించ‌కుండా తిరుగుతున్నార‌ని, రెండో డోసు తీసుకుంటేనే క‌రోనా నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుందంటున్నారు. మొద‌టిడోసు వ‌ల్ల 71 శాతం ర‌క్ష‌ణ ల‌భిస్తోంటే.. రెండో డోసు వ‌ల్ల 92 శాతం ర‌క్ష‌ణ ఉంటుంద‌ని స్పష్టం చేస్తున్నారు. కొవిషీల్డ్ మొద‌టి డోసుకు, రెండో డోసుకు మ‌ధ్య 12 వారాల వ్య‌వ‌ధి ఉన్న‌ట్ల‌యితే 77 శాతం ర‌క్ష‌ణ ల‌భిస్తుందంటున్నారు. ఇలా ఆల‌స్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల టి క‌ణాల ఆధారితంగా ఉండే రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మ‌వుతుంద‌ని వైద్య‌నిపుణులు తెలిపుతున్నారు. మొద‌టి డోసు పొందిన‌వారు రెండో డోసు తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేద‌ని, వీరికోసం ఏర్పాటు చేసిన ప‌లు టీకా కేంద్రాల‌ను కూడా మూయాల్సి వ‌స్తోంది. రెండో డోసు పొందిన త‌ర్వాతే పూర్తిస్థాయి ర‌క్ష‌ణ క‌రోనా నుంచి ల‌భిస్తుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ఉదాసీన వైఖ‌రి విడ‌నాడి ముందుకు రావాల‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: