కరోనా మరో వేవ్ రావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్టయింది. కరోనా పట్ల ఆందోళన వద్దు... అప్రమత్తంగా ఉందామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నామని... వైద్య, ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ టీకాలు తీసుకోవాలని.. అందరూ బూస్టర్ డోసు వేసుకోవాలని.. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం సర్వం సంసిద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.


ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంతో తెలంగాణ ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందని గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని పరిశీలించుకోవాలని.. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలన్న మంత్రి హరీశ్ రావు.. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: