అందం ఎవరికి చేదు, అందరికి అందంపై శ్రద్ద ఎక్కువే, కానీ సమయాభావం వల్ల, సహజ పద్దతులని పాటించే వీలు లేక పనికిమాలిన రసాయన క్రీములు రాసుకుంటూ ఉంటాం. కానీ కాస్త ఓపిక చేసుకుని ఇంట్లోనే సౌందర్య సాధనాలు చేసుకుంటే సహజసిద్దమైన అందం పొందుతాం, ఆరోగ్యంగా కూడా ఉంటాం. అయితే అలాంటి సహజసిద్ద పద్దతి ఇప్పుడు ఒకటి చూద్దాం.

 Related image

ఆరెంజ్ పండు ఎంత నిగనిగలాడుతుంది చెప్పండి. అందులో ఉండే పోషక గుణాలు మనకి శారీరక శక్తిని ఇస్తే ఆరెంజ్ పండు పైన ఉడే తొక్క మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలిసిందే. కానీ ఈ పండు తొక్కతో ఎలా సౌందర్య మిశ్రమం తయారు చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ విధానం మనం తెలుసుకుందాం. ముందుగ మంచి ఆరెంజ్ పండుని తీసుకుని దాని తొక్కలు తీసేయాలి.

 Image result for orange peel face mask

ఆ తొక్కాలని ఎండలో పెట్టి బాగా ఎండిన తరువాత పొడి చేసుకోవాలి. ఇలా పొడిగా వచ్చిన మిశ్రమాన్ని ఎన్నో రకాలుగా వివిధ పదార్ధాలు కలిపి ఫేస్ ప్యాక్ లుగా చేసుకుని లబ్ది పొందవచ్చు. ఉదాహరణకి . ఆరెంజ్ తొక్క పొడి ఓ స్పూన్ తీసుకుని అందులో రెండు స్పూన్స్ స్వచ్చమైన పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి ఒక గంట పాటు ఉంచి తరువాత ముఖం గోరు వెచ్చని నీటితో కడిగేయాలు. ఇలా వారానికి రెండు రోజులు చేయడం వలన మేలిమి చర్మం మీసొంతం అవుతుంది. అలాగే ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి, ఒక స్పూన్ స్వచ్చమైన పసుపు, ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లయినా సరే చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: