ఈ మధ్యకాలంలో చాలామంది ఏదైనా వంట సామాగ్రి కానీ, సరుకులు,పిల్లల వస్తువులు, తినుబండారాలు కొనాలి అంటే ఎక్కువగా సూపర్ మార్కెట్ వైపే పయనిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్ వద్ద ఉండే ట్రాలీలు చాలామంది ఉపయోగిస్తుంటాం.మరి కొంతమంది అందులో పిల్లలని కూర్చోబెట్టుకొని మరి హాయిగా షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఎంతో సురక్షితం అనుకొనే ఈ షాపింగ్ మాల్ ర్యాలీలు ఇన్ఫెక్షన్లకు నిలయమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో కొన్ని భయంకరమైన విజయాలను బయటపెట్టారు డాక్టర్ కునాల్ సూద్.


ఇటీవలే అరిజోనా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ఒక పరిశోధనలో డాక్టర్ కునాల్ సూద్  మాట్లాడుతూ అమెరికాలోని వివిధ నగరాలలో 85 షాపింగ్ ట్రాలీలు పరీక్షించగా వాటిపైన భయంకరమైన స్థాయిలో బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ట్రాలీల మీద మనం అసహ్యించుకొనే పబ్లిక్ టాయిలెట్లు ,ఇతర బహిరంగ ప్రాంతాలలో కంటే ఎక్కువగానే ఈ ట్రాలీల హ్యాండిల్స్ పైన బ్యాక్టీరియా ఉన్నదని తెలియజేశారు. మల సంబంధిత కాలుష్యం వల్ల వచ్చే కోలి బ్యాక్టీరియా షాపింగ్ మాల్స్ లో ఉపయోగించే ట్రాలిల హ్యాండిల్స్ పైన అధికంగా ఉన్నట్టుగా గుర్తించారు. దీనివల్ల విరోచనాలు వాంతులు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట.



షాపింగ్ ట్రాలీలు ఎండలో వానలో పార్కింగ్ స్థలాలలో అలాగే వదిలివేయడం వల్ల వాటి ఉపరితలం పైన బ్యాక్టీరియా కూడా చాలా వేగంగానే అభివృద్ధి చెందుతుందని దీనివల్ల వినియోగదారులు వాటిని ఉపయోగించే సమయంలో అవి చేతులకు అతుక్కుని ముఖానికి తాకడం లేదా పిల్లలకు ఏదైనా అక్కడే తినిపించడం వల్ల ఈ క్రిములు నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు షాపింగ్ మాల్  ర్యాలీలను ఉపయోగించేటప్పుడు శానిటైజర్ తో శుభ్రంగా చేతులు కడుక్కోవడం మంచిదని తెలిపారు. ముఖ్యంగా పిల్లలను ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలని ఆ హ్యాండిల్స్ ని ముట్టుకోవడం నోట్లో పెట్టుకోవడం వంటివి చేయకూడదని తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: