ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మార్క్ మూవీ కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తోంది.  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీప్శిఖ చంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అందం, అభినయంతో ఆమె సత్తా చాటారు.  ఆమె లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా కావడంతో పాటు ఎంతోమంది అభిమానులకు ఆమె క్రష్ గా మారారు.  సోషల్ మీడియాలో సైతం దీప్శిఖకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి ఏకంగా 3.36 లక్షల ఫాలోవర్లు ఉన్నారంటే దీప్శిఖకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో సులువుగా అర్థమవుతుంది.  సాధారణంగా యాక్షన్ మూవీస్ లో హీరోయిన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. అయితే దీప్శిఖ చంద్రన్  సినిమాలో కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. యాక్షన్ బ్లాక్స్ లో సైతం నటించి దీప్శిఖ చంద్రన్ ప్రత్యేకతను చాటుకోవడం గమనార్హం.

ఫ్యాన్స్ ఆమెను క్వీన్ ఆఫ్ మార్క్ అని పిలుస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మార్క్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవడంతో ఈ బ్యూటీకి ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. దీప్శిఖ చంద్రన్  రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటడం పక్కా అని చెప్పవచ్చు.  మార్క్ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతుండగా దీప్శిఖ చంద్రన్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి త్వరలో  స్పష్టత రానుంది.

ఇప్పటికే పలువురు కన్నడ హీరోయిన్లు తెలుగునాట సత్తా చాటుతుండగా దీప్శిఖ కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.  దీప్శిఖ చంద్రన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య  అంతకంతకూ పెరుగుతోంది. రిస్కీ స్టంట్స్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన  దీప్శిఖ చంద్రన్ రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో సత్తా చాటుతారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: